Advertisementt

నాగచైతన్య ఎందుకు ఫెయిలయ్యాడు..!

Sun 11th Dec 2016 03:09 PM
akkineni naga chaitanya,sahasam swasaga sagipo movie,director gautam menon,nikhil,ekkadiki pothavu chinnavada movie,nagarjuna  నాగచైతన్య ఎందుకు ఫెయిలయ్యాడు..!
నాగచైతన్య ఎందుకు ఫెయిలయ్యాడు..!
Advertisement
Ads by CJ

నాగచైతన్య - గౌతమ్‌మీనన్‌ - రెహ్మాన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం 'ఏ మాయచేశావే' చైతుకు తొలిబ్రేక్‌నిచ్చిన చిత్రంగా చెప్పవచ్చు. కాగా ఇదే కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం మాత్రం తెలుగులో బాగా నిరాశపరిచింది. 'ప్రేమమ్‌' వంటి హిట్‌ మూవీ తర్వాత వచ్చిన ఈ చిత్రంపై చైతూతో పాటు అక్కినేని అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. దీనికి నోట్ల రద్దు నిర్ణయం తర్వాత వచ్చిన మొదటి చిత్రం కావడం వల్లనే కలెక్షన్లు రాలేదని అక్కినేని అభిమానులు వాదిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో గ్రాస్‌గా కూడా కనీసం 10కోట్లు కూడా వసూలు చేయలేదని ట్రేడ్‌వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి. మరి ఆ తర్వాత వచ్చిన నిఖిల్‌ చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మాత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్ర దర్శకుడేమీ గౌతమ్‌మీనన్‌లాగా పేరున్న దర్శకుడు కాదు. ఇక నాగచైతన్యలాగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌, ఆల్‌రెడీ రెడీమేడ్‌ ఫ్యాన్స్‌కలిగిన హీరో నిఖిల్‌ కాదు. కానీ ఈ చిత్రం అద్బుతమైన కలెక్షన్లను సాధించింది. దీన్నిబట్టి చైతూ అసలు స్టామినా ఏమటో అర్ధమవుతోందని సినీ విమర్శకులు అంటున్నారు. ఇక 'సాహసం శ్వాసగా సాగిపో' తమిళ వెర్షన్‌లో శింబు నటించాడు. ఆయనకు ఈ మద్యకాలంలో హిట్స్‌లేవు. కానీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌ మాత్రం తమిళనాట సంచలన విజయం నమోదు చేస్తూ, శింబుకు పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పటికీ తమిళనాడులోని పలు సెంటర్స్‌లో హౌస్‌ఫుల్స్‌ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 80కోట్లకు పైగా గ్రాస్‌ వసూలు చేసిందని ట్రేడ్‌పండితులు చెబుతున్నారు. శింబుకు మాస్‌లో ఉన్న ఇమేజే ఈ చిత్రం తమిళంలో ఇంత పెద్దహిట్‌ కావడానికి హెల్ప్‌ చేసిందని విశ్లేషిస్తున్నారు. నోట్ల ఎఫెక్ట్‌ అనేది కేవలం తెలుగు రాష్ట్రాలలోనే లేదు. ఇది తమిళనాడుతో పాటు దేశం మొత్తం ఉన్న ఇబ్బంది. మరి ఈ చిత్రం విషయంలో చైతు తెలుగులో ఎందుకు ఫ్లాప్‌ అయ్యాడు? అని ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ