తమిళ సంగీత సంచలనం అనిరుధ్. తమిళంలో సంచలనాలకు మారుపేరుగా సాగుతోన్న ఆయన ఏడాది కిందటే టాలీవుడ్‌లోకి కూడా ఎంటర్ అవుతాడని భావించారు. రామ్‌చరణ్ హీరోగా నటించిన 'బ్రూస్‌లీ' చిత్రానికి మొదట ఆయన్నే సంగీత దర్శకునిగా ఎంచుకొని, ఆ తర్వాత పక్కనపెట్టారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం తన 'అ..ఆ'చిత్రానికి మొదట అనిరుధ్‌ను తీసుకొని, సినిమా సగం పూర్తయిన తర్వాత ఆయన స్దానంలో మిక్కిజె.మేయర్‌ను పెట్టుకున్న సంగతి కూడా తెలిసిందే. కాగా త్వరలో ప్రారంభం కానున్న త్రివిక్రమ్-పవన్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రానికి అనిరుధ్‌ను సంగీత దర్శకునిగా పెట్టుకున్నారు. ప్రస్తుతం అనిరుద్ ఈ చిత్రం కోసం ట్యూన్స్‌ను రెడీ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఈ విషయాన్ని కొన్ని రోజుల ముందే అనిరుద్ తన ట్విట్టర్ ద్వారా కన్‌ఫర్మ్ చేశాడు. తాజాగా ఎన్టీఆర్ కన్ను కూడా అనిరుద్‌పై పడింది. తాను తన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మాతగా బాబి దర్శకత్వంలో నటించబోయే తన 27వ చిత్రానికి కూడా ఎన్టీఆర్ సంగీత దర్శకునిగా అనిరుద్‌నే పెట్టుకున్నాడని సమాచారం. పవన్ ప్రస్తుతం 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్తాడు.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. ఆయన బాబితో చేయబోయే చిత్రం కూడా వచ్చే ఏడాది మొదట్లోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. త్రివిక్రమ్ చిత్రం కంటే ఎన్టీఆర్ చిత్రమే ముందుగా షూటింగ్‌ను ప్రారంభించుకొని, విడుదల విషయంలో కూడా పవన్-త్రివిక్రమ్‌ల చిత్రం కంటే ముందుగానే రిలీజ్ అవుతుందని సమాచారం. ఇలా చూసుకుంటే అనిరుధ్‌కు మొదటి ఛాన్స్‌ను పవనే ఇచ్చినప్పటికీ ఆ చిత్రం కంటే అనిరుద్ సంగీతం అందించనున్న ఎన్టీఆర్ చిత్రమే అనిరుద్‌కు తెలుగులో మొదటి చిత్రం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.