Advertisementt

భారీ డైలాగ్ తో ఆకట్టుకున్న హీరో..!

Mon 12th Dec 2016 10:28 PM
manchu manoj,gunturodu movie,director sathya,gunturodu movie 206 bones break dailogue,teaser release gunturodu movie,heroine pragya jaiswal  భారీ డైలాగ్ తో ఆకట్టుకున్న హీరో..!
భారీ డైలాగ్ తో ఆకట్టుకున్న హీరో..!
Advertisement
Ads by CJ

మంచు మనోజ్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా  'గుంటూరోడు'. ఇప్పటివరకు మాస్ చిత్రాలనే ఎక్కువగా నమ్ముకున్న మనోజ్ ఇప్పుడు కూడా మళ్ళీ మాస్ యాంగిల్ లో కనబడడానికి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. సత్య  డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో మనోజ్ కి జోడిగా కంచె హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ నటిస్తుంది. అయితే 'గుంటూరోడు' టీజర్ ని ఆ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ టీజర్ ఆమాంతం మాస్ యాంగిల్ లోనే ప్రెసెంట్ చేశారు. ఫైట్ సీన్స్ తో, యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ ని కట్ చేశారు. 'కొడితే ఒంట్లో ఉన్న 206 ఎముకలు ఒకేసారి ఇరిగిపోతాయ్ నా కొడకా..' అంటూ మనోజ్ భారీ డైలాగ్ తో ఈ చిత్రంపై  హైప్ క్రియేట్ చేసాడు. ఇక  'ఆ కొట్టుడేంది.. ఆడి పవరేంది.. గుంటూరు ఘాటు మిరపకాయ్ ఒరిజినల్ స్పీడ్ అమ్మా మొగుడిలా ఉన్నాడు' అంటూ కోటా మనోజని ఉద్దేశించే చెప్పే డైలాగ్ కూడా ప్రేక్షలను విపరీతంగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. మరి మంచి హిట్ కోసం చాల రోజుల నుండి ఎదురు చూస్తున్న మనోజ్ కి ఈ చిత్రం భారీ హిట్టిచ్చే సూచనలు ఎక్కువగానే కనబడుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ