Advertisementt

కుక్కలను కిడ్నాప్‌ చేసే హీరో..!

Tue 13th Dec 2016 05:41 PM
hero raj tarun,kittu unnadu jagratha movie,dongata movie,director fame krishna vamshi,rajendra prasad,writer veligonda srinivas  కుక్కలను కిడ్నాప్‌ చేసే హీరో..!
కుక్కలను కిడ్నాప్‌ చేసే హీరో..!
Advertisement
Ads by CJ

అదృష్టం ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే దానికి యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ను ఉదాహరణగా చూపించవచ్చు. హీరో అవుతానని ఎప్పుడూ ఊహించని ఈ కుర్రాడు 'ఉయ్యాల...జంపాలా' వంటి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో ఎవ్వరూ ఊహించని విధంగా హ్యాట్రిక్‌ కొట్టాడు. నేడు ఉన్న యంగ్‌ హీరోల్లో మినిమం గ్యారంటీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. ఇక ఆయన ఇటీవల నటించిన 'సీతమ్మ అందాలు... రామయ్య సిత్రాలు, ఆడోరకం... వీడో రకం' చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. ఈ రెండు చిత్రాలు పెద్ద విజయాలు సాధించనప్పటికీ ఈ హీరోకు ఉన్న క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆయన 'దొంగాట' ఫేమ్‌ వంశీకృష్ణ దర్శకత్వంలో 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త', రచయిత వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌ కీలకపాత్రలో 'అందగాడు' చిత్రాలను చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో అనిల్‌ సుంకరనే నిర్మిస్తుండటం విశేషం. ఇక ఆయన హీరోగా సంజనారెడ్డి దర్శకత్వంలో 'రాజుగాడు యమడేంజర్‌' అనే చిత్రం కూడా రూపొందుతోంది. తన ప్రతి చిత్రాన్ని వైవిధ్యంగా ఉండేలా, ఎంటర్‌టైన్‌మెంట్‌కు పెద్ద పీట వేసే చిత్రాలను ఆచితూచి ఒప్పుకుంటున్న ఈ హీరో నటిస్తున్న 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' చిత్రం కాన్సెప్ట్‌ టీజర్‌ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఆయన కుక్కలను కిడ్నాప్‌ చేసే దొంగగా వెరైటీపాత్రలో నవ్వించనున్నాడు. ఈ కాన్సెప్ట్‌ చిన్న పిల్లలలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే ఆడియన్స్‌ను, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షించడం ఖాయంగా కనిపిస్తుండటంతో ఇప్పటికే పెద్ద ఎత్తున బిజినెస్‌ ఎంక్వైరీలు జరుగుతున్నాయని సమాచారం. మొత్తానికి డైరెక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయిన ఈ యువహీరో జనాల నాడిని బాగా పసిగడుతూ, తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ కోసం ప్రయత్నిస్తుండటంతో ఆయన చిత్రాలపై బాగా అంచనాలు ఏర్పడుతున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ