కొంతకాలం కిందట తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్‌గా మీరాజాస్మిన్ మంచి స్వింగులో ఉండేది. ఆమె పవన్ సరసన నటించిన 'గుడుంబా శంకర్' ఆమెకు ఆనాడు ఉన్న డిమాండ్‌కు ఓ ఉదాహరణ, పెద్దగా గ్లామర్‌షో చేయకుండా, తన నటనతో అందరినీ మెప్పించిన ఆమె 'భద్ర'తో పాటు పలు హిట్ చిత్రాలు, అగ్రహీరోల చిత్రాలలో నటించింది. కానీ హీరోయిన్‌గా మంచి ఊపులో ఉన్న సమయంలో ఆమె మాండలిన్ రాజేష్‌ను పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించి సంచలనం సృష్టించింది. కానీ వారి బ్రేకప్‌కు పెద్దగా సమయం పట్టలేదు. ఆ తర్వాత ఆమె ఆల్‌రెడీ ఓ వివాహం అయిన అనిల్ జాన్ అనే వ్యాపారవేత్తను పలు వివాదాల మద్య పెళ్లి చేసుకుంది. ఆయన మాజీ భార్య బంధువులు పెళ్లి సమయంలో దాడి చేసేసరికి వారు పోలీస్ రక్షణతో వివాహం చేసుకున్నారు. కానీ ఆమె భర్త మొదటి భార్యకు ఇంకా విడాకులు ఇవ్వకపోవడం ఆతర్వాత సమస్యగా మారింది. వీరి వివాహం త్రివేండ్రంలోని చర్చిలో జరిగినా వీరి చేతికి ఇప్పటివరకు పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు రాలేదు. వీరి వివాహమై రెండేళ్లు అయింది. అయితే వీరి పెళ్లయిన ఏడాదికే వీరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి దీంతో ఆమె ఇటీవల విడిగా ఉంటోంది. మరోసారి నటిగా రీఎంట్రీ ఇచ్చి, ఆల్‌రెడీ ఓ చిత్రంలో నటించింది. చాలా మంది హీరోయిన్ల వివాహబంధాలలాగానే ఈమె బంధం కూడా కొద్దికాలంలోనే ముగిసిపోవడం బాధాకరం.