Advertisementt

'బాహుబలి' ని బాగా వాడుతున్న రచయిత..!

Wed 14th Dec 2016 01:48 PM
bahubali,vijayendra prasad,bahubali 2,bahubali writer  'బాహుబలి' ని బాగా వాడుతున్న రచయిత..!
'బాహుబలి' ని బాగా వాడుతున్న రచయిత..!
Advertisement
Ads by CJ

దేశ విదేశాల్లో 'బాహుబలి' చిత్రం సాధించిన సంచలన విజయాన్ని, ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్‌ను ఆ చిత్ర యూనిట్‌ అన్ని విధాలుగా క్యాష్‌ చేసుకుంటోంది. తాజాగా ఈ చిత్రం సెకండ్‌పార్ట్‌ షూటింగ్‌, పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలలో ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి, ఆయన యూనిట్‌ తలమునకలై ఉంది. మొదటి పార్ట్‌లోని యుద్ధ సన్నివేశాలను 1000 మంది జూనియర్స్‌ ఆర్టిస్ట్‌లతో భారీగా చిత్రీకరించిన రాజమౌళి సెకండ్‌పార్ట్‌లో వచ్చే సినిమాకు కీలకమైన, సినిమాకు హైలైట్‌గా నిలిచే క్లైమాక్స్‌ యుద్ద సన్నివేశాలను ఏకంగా 5000 మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో తెరకెక్కించనున్నాడు. కాగా ఈ చిత్రంలో బ్యాలెన్స్‌ ఉన్న షూటింగ్‌ పార్ట్‌ను డిసెంబర్‌ 27 కల్లా పూర్తి చేసి, ఇక విజువల్‌ఎఫెక్ట్స్‌తో పోస్ట్‌ప్రొడక్షన్‌పై పూర్తి దృష్టి పెట్టాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఈచిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా నేషనల్‌ వైడ్‌గా ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్‌ను మరింత క్యాష్‌ చేసుకోవాలని భావిస్తున్న ఈ చిత్ర రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రాన్ని 'గేమ్‌ ఆఫ్‌ ద్రోన్స్‌' తరహాలో టీవీ సీరియల్‌గా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

ప్రస్తుతం బాహుబలి పార్ట్‌2 కథకు ఫినిషింగ్‌ టచ్‌లు ఇస్తూ, నగిషీలు దిద్దుతున్న ఆయన ఈ చిత్ర కథను ఓ జాతీయ చానెల్‌ కోసం టీవీ సీరియల్‌గా మలిచే విధంగా స్క్రిప్ట్‌ను తయారుచేసే బిజీలో ఉన్నాడు. ఆయనే స్క్రిప్ట్‌ను అందిస్తున్న ఈ సీరియల్‌కు కూడా ఈ చిత్రాన్ని తీసిన లోకేషన్లు, సెట్స్‌నే ఉపయోగించుకోనున్నారు. ఇక హిందీలో రూపొందించే ఈ టీవీ సీరియల్‌ను వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా డబ్‌ చేసి చానెల్స్‌లో ప్రసారం చేయడానికి రెడీ అవుతున్నారు. ఓ ప్రముఖ టీవీ సీరియల్స్‌ను నిర్మించే నిర్మాణ సంస్థ ఈ సీరియల్‌ కోసం బుల్లితెరపై బాగా పేరుపొందిన నటీనటుల అన్వేషణలో ఉంది. ఇక ఈ టీవీ సీరియల్‌ స్క్రిప్ట్‌, ఈచిత్రం పార్ట్‌2 ఫినిషింగ్‌ టచ్‌లు ఇవ్వడంతో పాటు 'వల్లి' అనే స్క్రిప్ట్‌ను తయారు చేసి, దానికి తానే దర్శకత్వం వహించే పనిలో కూడా ఉన్నాడు రచయిత విజయేంద్రప్రసాద్‌. మరోపక్క 'ఒకేఒక్కడు' చిత్రానికి బాలీవుడ్‌ వెర్షన్‌గా తెరకెక్కిన 'నాయక్‌' చిత్రం సీక్వెల్‌కు కూడా ఆయనే కథను అందించనున్నాడట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించనుందని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ