బాలీవుడ్ బుల్లితెరపై హాట్‌షోగా పేరొందిన 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రాంలో తాజాగా సల్మాన్‌ఖాన్, ఆయన సోదరులు అర్బాజ్‌ఖాన్, సొహైల్‌ఖాన్‌లు పాల్గొన్నారు. కాగా గతంలో కూడా ఇదే షోతో పాటు పలుసార్లు తనకి ఇంత వయసు వచ్చినా తాను ఇంకా వర్జిన్‌నే అని సల్మాన్ తెలిపాడు. కాగా తాజాషోలో కూడా సల్మాన్ అదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పాడు. కానీ ఈ మాటలను ఆయన సోదరుడు అర్భాజ్‌ఖాన్ తోసిపుచ్చాడు. సల్లూభాయ్ సెక్స్ లేకుండా ఉండలేడని ఆయన కుండబద్దలు కొట్దాడు.
ఇక సల్మాన్ మాట్లాడుతూ, తను రిలేషన్స్ మెయిన్‌టెయిన్ చేయడంలో కాస్త బ్యాడ్‌బోయ్‌నే అనగా ఆయన సోదరులు మాత్రం తమ అన్నయ్య చాలా మంచివాడని కితాబునిచ్చారు. మరోపక్క కరణ్ మాట్లాడుతూ, పెద్దలను గౌరవించడం ఎలాగో సల్మాన్‌ను చూసి నేర్చుకోవాలని తన తల్లి అంటూ ఉంటుందని తెలిపాడు. మొత్తంగా ఈ షోలో సల్మాన్ సెక్స్ విషయంలో రహస్యాన్ని బట్టబయలు చేసిన ఆయన సోదరుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయ్యాయి.