Advertisementt

చేతులు కాలిన తర్వాత ఆకులుపట్టుకుంటోంది..!

Wed 14th Dec 2016 03:49 PM
heroine saloni,maryadaramanna movie herione,maghadeera movie,sri hari,saloni new movie meelo evvaru koteeswarudu,hero prudhvi  చేతులు కాలిన తర్వాత ఆకులుపట్టుకుంటోంది..!
చేతులు కాలిన తర్వాత ఆకులుపట్టుకుంటోంది..!
Advertisement
Ads by CJ

అందం, అభినయం ఉన్నా కూడా మరీ మడికట్టుకుని కూర్చోవడం వల్ల హీరోయిన్‌ సలోనికి సరైన బ్రేక్‌ రాలేదు. 'ఒక ఊరిలో' చిత్రం పోస్టర్స్‌, ప్రొమోలు చూసిన అందరూ ఆమె టాప్‌ హీరోయిన్‌ అవుతుందని భావించారు. కానీ ఆమె ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సంచలన చిత్రం 'మగధీర'లో శ్రీహరితో కలిసి ఓ పాటలో డ్యాన్స్‌ చేసింది. దాంతో పాటు ఆ వెంటనే రాజమౌళి దర్శకత్వంలోనే రూపొందిన హిట్‌ మూవీ 'మర్యాదరామన్న' చిత్రంలో సునీల్‌ సరసన నటించింది. దాంతో ఆమె కెరీర్‌ మరలా ఊపందుకుంటుందని అందరూ భావించారు.

కానీ ఆ హిట్‌ క్రెడిట్స్‌ రాజమౌళి ఖాతాలో పడిపోవడంతో దిగాలు చెందింది. కెరీర్‌ మంచి ఊపులో, పలు అవకాశాలు వచ్చినప్పుడు ఆమె గ్లామర్‌షో విషయంలో దర్శకనిర్మాతలకు పలు కండీషన్లు పెట్టి ఇబ్బంది పెట్టడం ఆమె కెరీర్‌కు మైనస్‌ పాయింట్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడు కాస్త మెట్టు దిగింది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తూ, చిన్న, పెద్ద తేడా లేకుండా ఎందులో అవకాశం వచ్చినా ఒప్పేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈనెల 16న విడుదలకు సిద్దమవుతున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రంలో ఆమె థర్టీ ఇయర్స్‌ పృథ్వీ సరసన నటిస్తుండటమే దీనికి ఓ ఉదాహరణ. కాగా ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ఇంతకాలం పద్దతిగా, నిండుగా కనిపించిన ఈ అమ్మడు ఎద అందాలను చూపిస్తూ, కెమెరాలకు ఫోజులిచ్చింది. ఆమె క్లీవేజ్‌ షో చూసి అందరూ ఆశ్చర్యపోవడమే కాదు.. నవ్వుకున్నారు. నిండా మునిగిన తర్వాత ఇంక ఎంత చూపించినా లాభం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ