సన్నీలియోన్.. పోర్న్ ఇండస్ట్రీ నుంచి భారత్‌కు వచ్చి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా వార్తల్లో నిలుస్తోంది. కాగా 2016 బిబిసి '100 ఉమెన్స్'లో ఆమెకు స్దానం దక్కింది. ఈ సందర్భంగా ఆమె బిబిసి వరల్డ్ న్యూస్‌తో మాట్లాడుతూ, భారత్‌పై, ఇక్కడి ప్రజలపై, దేశంలోని మన సినీ పరిశ్రమలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె ఇండియన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదేళ్లయింది. 'బిగ్‌బాస్' రియాల్టీ షో ద్వారా ఆమె ఇక్కడ ప్రత్యక్షమైంది. మొదట్లో ఆమె భారతీయ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె భారతీయ సంస్కృతిని మంటగలుపుతోందని, ఆమె వెంటనే దేశం విడిచిపోవాలని కూడా కేసులు నమోదయ్యాయి.
వీటన్నింటిని గురించి సన్ని మాట్లాడుతూ, అత్యధిక జనాభా కలిగిన ఇండియా ఈ విషయంలో తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుందని వ్యాఖ్యానించింది. నా సినిమాలు చూడమని నేనెవ్వరినీ బలవంతం చేయడం లేదు. మీకు నా గురించి ఆసక్తి లేకపోతే నా చిత్రాలు చూడకండి. ఇంటర్నెట్‌లో నా గురించి తెలుసుకోవడానికి వెతకాల్సిన పనిలేదు. గూగుల్ సెర్చ్‌లో ఇండియాలోనే అత్యధికులు నా గురించే సెర్చ్ చేస్తుంటారు. అలాంటి ఇండియన్స్‌కు నా గురించి వెకిలిగా మాట్లాడే హర్హతే లేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో పురుషాధిక్యం నడుస్తోంది.
ఇక్కడి హీరోయిన్లు మనసు చంపుకొని కెరీర్‌లను కొనసాగిస్తున్నారు. ఇక బాలీవుడ్ కంటే పోర్న్ ఇండస్ట్రీనే బెటర్. అక్కడ జాతి, మత, లింగ భేదాలు లేవు. అందరినీ సమానంగా చూస్తారు...అంటూ వ్యాఖ్యానించింది. నా గురించి, నా క్రేజ్ గురించి తెలుసు కాబట్టే తమ చిత్రంలో నేను కనిపించాలని, నా గ్లామర్‌షోను చూపి క్యాష్ చేసుకోవాలనే నాకు అవకాశాలు ఇస్తున్నారని తేల్చిచెప్పింది. ఈ వ్యాఖ్యలపై మరోసారి దుమారం చెలరేగుతోంది. ఇక్కడి ఇండస్ట్రీ ఆమెకు నచ్చకపోతే ఆమె తిరిగి పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లవచ్చు కదా..! అంటూ విమర్శలు చెలరేగుతున్నాయి.