ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, ఆచి తూచి నిర్ణయం తీసుకుని మరీ డైరెక్టర్ బాబీ కి అవకాశం ఇచ్చాడు. అతను చెప్పిన కథ నచ్చడంతో బాబీతో సినిమా చెయ్యడానికి రెడీ అయిన ఎన్టీఆర్ కి ఇప్పుడు ఒక సమస్య వెంటాడుతోందట. అదేమిటంటే హీరోయిన్ సమస్య అంటున్నారు. ఎన్టీఆర్ తాజా చిత్రంలో ఏ హీరోయిన్ అయితే బావుంటుందో అని డైరెక్టర్ దగ్గర నుండి హీరో గారి వరకు తెగ సెర్చ్ చేస్తున్నారట. కొత్త హీరోయిన్ జోలికి వెళ్లకుండా ముందుగా టాప్ హీరోయిన్స్ ని తీసుకోవాలని భావించిన ఎన్టీఆర్ అండ్ టీమ్ కి ముందుగా సమంత అయితే బావుంటుందని అనుకున్నారట. ఇక సమంతని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుందామనుకున్న టైమ్ లో ఈవిడగారు తన మరిది అఖిల్ అక్కినేని పెళ్లి కోసం ఏకంగా ఫిబ్రవరి అంతా కేటాయించాలని అనుకుంటుందట. ఆ పెళ్లి కోసం ఆమె విదేశాలకు వెళ్ళిపోతుందని టాక్. సరే సమంత కాకపోతే శృతి హాసన్ ని అయినా తీసుకుందామని భావించి ఆమెని అప్రోచ్ అవ్వగా శృతి కి కూడా డేట్స్ ప్రాబ్లెమ్ వల్ల కుదరదని చెప్పినట్టు సమాచారం. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ వేటలో టీమ్ ఉందని సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ తన సినిమాని మొదలెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇక మొదలయ్యే సమయం లో మళ్ళీ ఇప్పుడు ఈ హీరోయిన్ సమస్యేమిటో? అని ఎన్టీఆర్ అభిమానులు వాపోతున్నారట. ఇక ఎన్టీఆర్ కొత్త చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.