Advertisementt

మెగాస్టార్ ని..పవర్ స్టార్ ని లెక్కచేయని సునీల్..!

Fri 16th Dec 2016 01:34 PM
hero sunil,hega star chiranjeevi,power star pawan kalyan,director trivikram,khaidi no 150 movie  మెగాస్టార్ ని..పవర్ స్టార్ ని లెక్కచేయని సునీల్..!
మెగాస్టార్ ని..పవర్ స్టార్ ని లెక్కచేయని సునీల్..!
Advertisement
Ads by CJ

సునీల్ కి ఈ మధ్యన హీరోగా పెద్దగా కలిసి రావడం లేదు. అసలే కమెడియన్ పోస్ట్ కి బ్రేక్ ఇచ్చి మరీ హీరో గా సెటిల్ అయినా సునీల్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక దిక్కు తోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. అయినా కమెడియన్ గా అవకాశాలు వచ్చినా కూడా వాటిని లెక్క చెయ్యకుండా ఇంకా హీరోగా ఎవరన్నా ఛాన్స్ ఇస్తారేమో అని కాచుకు కూర్చున్నాడు. మరో పక్క సునీల్ తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం కూడా జరుగుతుంది. కానీ అవేమి పట్టాలెక్కే ఛాన్స్ లేదని తేలిపోయింది.

మరి మళ్ళీ కమెడియన్ గా వచ్చెయ్యొచ్చు కదా.. అని చాలామంది సునీల్ కి నచ్చజెబుతున్నారట. ఇక సునీల్ ని ఇప్పటికే చిరంజీవి 150  వ చిత్రం ఖైదీ నెంబర్ 150  లో కమెడియన్ గా చెయ్యమని కోరగా తనకి డేట్స్ ఖాళీ లేవని తప్పించుకున్నాడట. అంటే సునీల్ కి ఇప్పుడు చేతిలో సినిమా లేక పోయిన కూడా డేట్స్ ఖాళీ లేవా? అని అందరి  మదిలో మెదిలే ప్రశ్న. అంటే సునీల్ కి కమెడియన్ గా మళ్లీ ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదనేగా దానర్ధం. ఇక అన్న సినిమాలో చెయ్యనని చెప్పిన సునీల్ ఇప్పుడు తమ్ముడి సినిమాలో కూడా చెయ్యనని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.

త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం లో సునీల్ కి ఒక మంచి పాత్రని రెడీ చేసాడట త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎందుకంటే సునీల్ త్రివిక్రమ్ కి ఆప్త మిత్రుడాయె. అందుకే సునీల్ తన సినిమాలో కమెడియన్ గా చేస్తాడనే నమ్మకం తో త్రివిక్రమ్ సునీల్ కి ఒక కేరెక్టర్ ని డిజైన్ చేసాడట. అయితే  ఈ ఛాన్స్ ని కూడా సునీల్ కాదన్నాడనే మాట వినిపిస్తోంది. మరి ఏంతో నమ్మకంతో వున్న త్రివిక్రమ్ కి స్నేహితుడైన సునీల్ అలా ఎందుకు నో చెప్పేసాడో.  అసలే హీరోగా అవకాశాలు రావడం లేదు అయినా కూడా ... మెగాస్టార్, పవర్ స్టార్ పక్కన కమెడియన్ గా సునీల్ ఎందుకు చెయ్యనన్నాడో అందరూ తెగ చర్చించుకుంటున్నారట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ