Advertisementt

స్టార్స్‌ని ఢీకొంటున్న యంగ్‌హీరో..!

Fri 16th Dec 2016 04:29 PM
hero sharwanand,new movie shatamanam bhavathi,producer dij raj,director sateesh vegnesh,shatamanam bhavathi movie release date on 14yh january 2017,chiranjeevi khaidi no 150,balakrishna gautamiputra satakarni movie  స్టార్స్‌ని ఢీకొంటున్న యంగ్‌హీరో..!
స్టార్స్‌ని ఢీకొంటున్న యంగ్‌హీరో..!
Advertisement
Ads by CJ

కథపై నమ్మకం, సరైన నిర్మాత ఉంటే.. కొండలను ఢీకొట్టడానికి కూడా కొందరు హీరోలు వెనుకాడరు. ప్రస్తుతం అదే నమ్మకంతో యంగ్‌హీరో శర్వానంద్‌ ఉన్నాడు. ఆయన హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా దిల్‌రాజు నిర్మాతగా, సతీష్‌ వేగ్నేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'శతమానం భవతి' చిత్రంపై ఉన్న నమ్మకంతో మరోసారి భారీ దిగ్గజాలను ఢీకొట్టేందుకు శర్వా రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి బడా బడా హీరోల చిత్రాలు విడుదలైనప్పటికీ తన 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'తో బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన మరోసారి అదే ఫీట్‌ను రెడీ చేస్తున్నాడు. 

తాత, మనవళ్ల అనుబంధంతో సెంటిమెంట్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'శతమానం భవతి' చిత్రం జనవరి 14న విడుదలకు సిద్దమవుతోంది.కాగా దానికి రెండుమూడు రోజల ముందే మెగాస్టార్‌ ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీనెంబర్‌150', నటసింహం నటించిన వందో చిత్రంగా రూపొందుతున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి'లు థియేటర్లను ఖబ్జా చేయనున్నాయి. కానీ ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత కావడంతో ఈ చిత్రం విషయంలో థియేటర్ల కొరత వచ్చే అవకాశం లేదు. మరోపక్క దిల్‌రాజుకు కూడా సంక్రాంతి బాగా అచ్చివచ్చింది. ఇక ఈ ఏడాది 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' కూడా జనవరి 14వ తేదీనే విడుదలవ్వడం మరో సెంటిమెంట్‌. ఇక ఈ చిత్రంలో దిల్‌రాజుకు బాగా కలిసొచ్చిన ప్రకాష్‌రాజ్‌, జయసుధలు నటిస్తుండటం విశేషం. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోను ఈనెల 18న హైదరాబాద్‌లో వైభవంగా జరపడానికి దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ