సూర్య నటిస్తున్న 'ఎస్3'చిత్రం విడుదలను జనవరి 26కి పోస్ట్‌పోన్ చేయడంతో ఆ తేదీనే రావాలని భావించిన సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ 'గురు' , దాదాపు అదే తేదీన లేదా ఓ వారం గ్యాప్‌తో ఫిబ్రవరి 3న రిలీజ్ అనుకుంటున్న దిల్‌రాజు-నానిల 'నేను..లోకల్' చిత్రాల రిలీజ్ డేట్స్ మారుతాయా? లేదా? అన్న అంశం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. 'ఎస్3' జనవరి 26న రిలీజ్ అయితే కోలీవుడ్‌లో మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ లేకపోయినా తెలుగు చిత్రాలపై మాత్రం ఈ ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వెంకీ 'గురు'ని వై నాట్ స్టూడియస్ అనే టాలీవుడ్‌కి కొత్త అయిన నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నప్పటికీ సురేష్‌బాబు అండతో ఈ చిత్రానికి థియేటర్ల ప్రాబ్లమ్స్ ఉండవు. ఇక దిల్‌రాజుకు ఉన్న పలుకుబడి దృష్ట్యా 'నేను...లోకల్' చిత్రానికి కూడా ఆ సమస్యలు ఉండవు. దీంతో 'ఎస్3' చిత్రం తెలుగు వెర్షన్‌ను పెద్దగా అనుభవం, పలుకుబడి లేని మల్కాపురం శివకుమార్ విడుదల చేస్తుండటంతో సూర్య చిత్రానికే ఇది తెలుగులో పెద్ద తలనొప్పిగా మారుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు.
కానీ బి,సి సెంటర్లలో మాత్రం మాస్ ప్రేక్షకులు సెమీ రీమేక్ అయిన 'గురు', దిల్‌రాజు 'నేను...లోకల్' కంటే 'ఎస్3'కే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉండటం వల్ల ఈ తేదీన ఈ మూడు చిత్రాలు విడుదలైతే మాత్రం అన్ని చిత్రాల కలెక్షన్స్‌పై ఈ ప్రభావం ఖచ్చితంగా పడుతుందని చెప్పవచ్చు. కాగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రామ్‌చరణ్ 'ధృవ'కు ఇప్పట్లో మరో పెద్ద చిత్రం పోటీ లేనందువల్ల అల్లు అరవింద్ దీనిని సద్వినియోగం చేసుకోవడానికి పావులు కదుపుతున్నాడట.