టాలీవుడ్ నెంబర్‌వన్ పోటీలో పవన్, మహేష్‌ల మద్య తీవ్రమైన పోటీ ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో ఈ ఇద్దరు స్టార్స్ మధ్యే కాదు.. వారి అభిమానుల్లో కూడా తీవ్ర వాగ్యుద్దం నడుస్తూ ఉంటుంది. మహేష్ ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్‌లో తమిళ, తెలుగు భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్‌ను జనవరి 1న, ఫస్ట్‌లుక్‌ను రిపబ్లిక్‌డే కానుకగా జనవరి 26న విడుదల చేయనున్నామని యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
కాగా ప్రస్తుతం పవన్ విషయానికి వస్తే ఆయన తమిళ 'వీరం' ఆధారంగా డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్ నిర్మాణంలో శృతిహాసన్ హీరోయిన్‌గా 'కాటమరాయుడు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం 'కాటమరాయుడు' చిత్రంలో పవన్ ఫస్ట్‌లుక్‌ను కూడా జనవరి 1నే విడుదల చేయనున్నారట. సో.. కొత్త ఏడాది ప్రారంభం రోజున మహేష్ అభిమానులు మురుగదాస్ చిత్రం టైటిల్ కోసం, మరోవైపు అదే రోజు పవన్ అభిమానులు 'కాటమరాయుడు' చిత్రంలో తమ అభిమాన హీరో ఫస్ట్‌లుక్ కోసం వేయికళ్లతో ఎదురుచూడటం ఆసక్తిని కలిగిస్తోంది.