పోర్న్‌స్టార్ నుండి ఇండియన్ సిల్వర్‌స్క్రీన్‌కు వచ్చి, తన హాట్‌హాట్ అందాలతో సంచలనాలు సృష్టిస్తోన్న సెక్సీబ్యూటీ సన్నిలియోన్. ఆమెపై ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం ఆమె క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. పలువురు స్టార్ హీరోలు కూడా ఆమె తమ చిత్రంలో చిన్న పాత్ర చేసినా అది తమకు ప్లస్ పాయింట్ అవుతుందని భావించేలా ఆమె హవా కొనసాగుతోంది.
కాగా ఆమె ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా నటిస్తోన్న 'రాయిస్' చిత్రంలో ఓ ఐటంసాంగ్‌లో నర్తించింది. ఈ పాటపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ ఏర్పడుతోంది. కాగా ఆమెకు ఉన్న డిమాండ్‌కు తాజాగా జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఓ ప్రైవేట్ స్టార్‌హోటళ్ల నిర్వాకులు సన్ని చేత లైవ్ పెర్ఫార్మెన్స్ ఇప్పించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందుకు గాను ఆమెకు ఏకంగా 4కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్దపడ్డారు. కాగా ప్రస్తుతానికి సన్ని ఈ ఆఫర్‌కు ఇంకా అంగీకారం తెలపలేదట. దానికి కారణం.. ఆమెకు ఆ రోజున పలువురి నుండి ఇలాంటి లైవ్‌ఫెర్ఫార్మెన్స్ ఇప్పించడానికి పోటీ పడుతుండటంతో తనకు వేరెవరి నుంచైనా ఇంతకు మించిన పెద్ద మొత్తం ఆఫర్ వస్తుందేమో? అనే ఆలోచనలో ఆమె ఉందని సమాచారం.