Advertisementt

చరణ్‌ దీనిపై స్ట్రాంగ్‌గానే రిప్లై ఇచ్చాడు..!

Mon 19th Dec 2016 12:08 PM
mega star ram charan,dhruva mvoie,chiranjeevi,khaidi no 150 movie,pawan kalyan,katamarayudu movie  చరణ్‌ దీనిపై స్ట్రాంగ్‌గానే రిప్లై ఇచ్చాడు..!
చరణ్‌ దీనిపై స్ట్రాంగ్‌గానే రిప్లై ఇచ్చాడు..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం తమిళ 'కత్తి'కు రీమేక్‌గా 'ఖైదీ నెంబర్‌ 150' చిత్రం చేస్తున్నాడు. మరోవైపు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తమిళ 'వీరం'కు రీమేక్‌గా 'కాటమరాయడు'లో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన రామ్‌చరణ్‌ 'ధృవ' చిత్రం కూడా తమిళ 'తని ఒరువన్‌'కు రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. దీంతో సోషల్‌ మీడియాలో మెగా హీరోలందరూ రీమేక్స్‌ వెంటపడుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై రామ్‌చరణ్‌ స్పందించాడు. 

రీమేక్స్‌ చేయడం తప్పని నేను భావించడం లేదు. సినిమాకు ఎల్లలులేవని నేను నమ్ముతాను. రీమేక్స్‌ అయినప్పటికీ అవి కూడా సినిమాలే కదా..! ఏపీ, తెలంగాణ, తమిళనాడు... అనే వాటికంటే మనం అందరం ముందుగా భారతీయులమని గుర్తించాలి. ముందుగా తమిళంలో వచ్చిందా? మరాఠిలో వచ్చిందా? అనేది ముఖ్యంకాదు. ఇతర భాషల్లోని మంచి చిత్రాలను మన ప్రేక్షకులకు అందించాలనే నిజాయితీగా ప్రయత్నిస్తున్నాం. సినిమా బాగున్నప్పుడు అలాంటి విమర్శలు చేయడం పద్దతి కాదు. 

తెలుగులో కొత్తదనం నిండిన కథలు లేకపోవడం లేదా మాకు అలాంటి కథలు దొరక్కకాదు. మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి విమర్శలను పట్టించుకోకుండా మంచి సినిమాలను ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నాను.. అంటూ వ్యాఖ్యానించాడు. 'ధృవ' చిత్రం కోసం అమెరికాలోని డల్లాస్‌లో ఆయన ఎన్నారైలతో సమావేశమైన సందర్భంగా ఈ ప్రస్తావన రావడంతో చరణ్‌ దీనిపై స్ట్రాంగ్‌గానే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ