Advertisementt

స్వామికి షాకిచ్చిన మహేష్‌..!

Mon 19th Dec 2016 01:12 PM
dhruva movie vilan,arvind swamy,mahesh babu,director koratala shiva,new movie,arvind swamy ask 4 crores ennumaration  స్వామికి షాకిచ్చిన మహేష్‌..!
స్వామికి షాకిచ్చిన మహేష్‌..!
Advertisement
Ads by CJ

'ధృవ' చిత్రంలో విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్‌స్వామి నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో ఆయనకు తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రం ఒరిజినల్‌ తమిళ వెర్షన్‌ 'తని ఒరువన్‌'లో ఆయన అదే పాత్ర చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తాను పోషించిన పాత్రను మిగిలిన భాషల రీమేక్‌లలో పోషించడం తనకు ఇష్టం లేదని చెప్పిన స్వామి మనసు మార్చుకొని అదే పాత్రను తెలుగులో చేయడానికి ఒప్పుకున్నాడు. దానికి కారణం ఆయనకు తెలుగు వెర్షన్‌లో నటించేందుకు భారీ పారితోషికం ఆఫర్‌ చేయడమే కారణం. కాగా ఈ చిత్రంలో తన పాత్రకు గాను ఆయన 3కోట్లకు పైగా రెమ్యూనరేషన్‌ తీసుకున్నాడని సమాచారం. 

తాజాగా 'ధృవ' చిత్రం ద్వారా ఆయనకు వచ్చిన ఇమేజ్‌, విలన్‌ అంటే ఇలా ఉండాలి.. అనేంతగా మెప్పును పొందుతున్న స్వామిని మహేష్‌బాబు-కొరటాల కాంబోలో ప్రారంభంకానున్న చిత్రంలో కూడా విలన్‌గా తీసుకోవాలని భావించారట. కానీ స్వామి మాత్రం 'ధృవ' చిత్రం కంటే ఎక్కువ రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేశాడట. ఈ విషయం తెలుసుకున్న మహేష్‌ అంత పెద్ద మొత్తం ఇచ్చి ఆయన్ను పెట్టుకోవాల్సిన అవసరం లేదని దర్శకనిర్మాతలకు కుండబద్దలు కొట్టాడట. 

కాగా ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ప్రముఖ సీనియర్‌ పాత్రికేయులు వినాయకరావు మహేష్‌ తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ వ్యక్తిగత, సినీ జీవిత విశేషాలను రీసెర్చి చేసి, ఆయనపై 'దేవుడు చేసిన మనిషి' అనే పుస్తకాన్ని రాసి, తాజాగా దీనిని రిలీజ్‌ చేశారు. ఈ పుస్తకం ఎప్పుడెప్పుడు చదువుతానా అని తాను ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మహేష్‌ ట్వీట్‌ చేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ