తన చిత్రాల కంటే వివాదాస్సదమైన ట్వీట్స్ ద్వారా వర్మ సంచలనాలు సృష్టిస్తుంటాడు. మరి ఆయనకు మెగా హీరోలతో ఎప్పుడు, ఎందుకు చెడిందో గానీ ఈమద్య ఆయన మెగా హీరోలకు సంబంధంలేని విషయాలలోకి కూడా వారిని లాగి వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజాగా విడుదలైన బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్ చూసి ఫిదా అయిపోయానని ట్వీట్ చేసిన వర్మ మరోసారి మెగాస్టార్ చిరంజీవిపై వెటకారపు ట్వీట్స్ చేశాడు. ఆయన మెగాభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ, మీరు నిజమైన మెగాస్టార్ అభిమానులైతే ఆయన్ను 'బాహుబలి, శాతకర్ణి' వంటి చిత్రాలలో నటించాలని బలవంతం చేయాలన్నాడు.
'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుపైకి ఎక్కిస్తుందన్నాడు. నేను నిజమైన మెగాస్టార్ అభిమానిగా చెబుతున్నది ఏమిటంటే చిరు కూడా ఇలాంటి పాత్రలు చేసి తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చాలన్నాడు. కాగా సంక్రాంతికి బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్150'లు పోటీపడనున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని వర్మ మరో ట్వీట్‌లో 'గౌతమీపుత్ర శాతకర్ణి' ట్రైలర్ చూసిన తర్వాత సంక్రాంతికి పోటీ ఉండదని, వార్ వన్ సైడ్ అయిపోతుందని వ్యాఖ్యానించాడు. తాజాగా విడుదలైన 'ఖైదీ నెంబర్ 150' పోస్టర్‌పై కూడా ఆయన వెటకారపు కామెంట్స్ చేశాడు. ఈ పోస్టర్‌ను చూస్తే, జేమ్స్‌కామరూన్, క్రిష్టఫర్ నోలన్ వంటి సినీ దిగ్గజాలు కూడా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారంటూ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్‌లో ఆయన 'నిజమైన 'కత్తి' కన్నా మెగాషార్ప్‌గా బాలయ్య చిత్రం ట్రైలర్ కనిపిస్తోందన్నాడు.
'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం ట్రైలర్ అదరగొట్టిందనేది వాస్తవం. అందుకని దానిని ప్రశంసిస్తే తప్పులేదని, కానీ మద్యలో మెగాస్టార్‌ను వివాదంలోకి లాగడం ఎందుకని మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం ట్రైలర్‌ను పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, నితిన్, నిఖిల్, రకుల్ వంటి వారే గాక బాలీవుడ్ ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ కూడా ఈ చిత్రం ట్రైలర్‌ను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోపక్క ఈ ట్రైలర్ సామాన్య ప్రేక్షకులను కూడా మురిపిస్తోంది. ఈ చారిత్రక గాథపై సామాన్యులకు అవగాహన లేకపోయినా , ఇందులో బాలయ్య అదిరిపోయే గెటప్, క్రిష్ చూపించిన అద్భుతమైన విజువల్స్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారన్నది వాస్తవం.