టాలీవుడ్ లో మంచి చిత్రంగా పేరు తెచ్చుకొని దర్శకుడు దేవా కట్టాకు కూడా పెద్ద ఎత్తున గుర్తింపు తెచ్చిన చిత్రం ప్రస్థానం. ప్రస్తుతం ప్రస్థానం చిత్రం బాలీవుడ్ కి వెళ్ళనున్నట్లు టాక్ నడుస్తుంది. కాగా తెలుగు సినీ అభిమానులను అమితంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ద్వారానే సాయికుమార్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేశాడు. అటువంటి గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకున్న ప్రస్థానం చిత్రాన్ని బాలీవుడ్ లోకి తీసుకెళ్ళేందుకు దర్శకుడు దేవా కట్టా సర్వం సిద్ధం చేసేసినట్లు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రానికి గాను సాయికుమార్ చేసిన పాత్రలో బాలీవుడ్ లో నానా పటేకర్ నటిస్తారని కూడా వెల్లడౌతుంది. శర్వానంద్, సందీప్ కిషన్‌పాత్రలు పోషించిన పాత్రలు ఎవరిని ఎన్నుకోవాలన్న విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.
కాగా ప్రస్థానం సినిమా విడుదలై దాదాపు తొమ్మిది సంవత్సరాలు కావొస్తుంది. అయినా సరే ఈ చిత్రం ఎప్పుడు చూసినా నిత్య నూతనంగా ఉంటుంది. గాడ్ పాదర్‌లాంటి సినిమాను ఆధారంగా చేసుకొని చేసిన చిత్రం ప్రస్థానం. అయితే గతంలో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని భావించిన ఆ చర్చలు ఒక కొలిక్కి రాలేదు. కాగా తాజాగా ఈ సినిమాని బాలీవుడ్‌లోకి తీసుకెళ్లి అక్కడ చేయాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడు దేవాకట్టా. అయితే బాలీవుడ్ లో కూడా ఈ చిత్రాన్ని దేవాకట్టానే దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ప్రొడక్షన్ వ్యవహారాల్ని చూసుకోనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి ప్రస్థానం చిత్రం బాలీవుడ్ లో ఎంతటి ప్రస్థానాన్ని కైవసం చేసుకుంటుందో చూద్దాం.