Advertisementt

ఈ యాంకర్ కనిపించకపోవడానికి కారణమిదే!!

Tue 20th Dec 2016 05:01 PM
anchor lasya,lasya turned heroine,anchor lasya and ravi,raja meeru keka  ఈ యాంకర్ కనిపించకపోవడానికి కారణమిదే!!
ఈ యాంకర్ కనిపించకపోవడానికి కారణమిదే!!
Advertisement
Ads by CJ

బుల్లితెర మీద యాంకర్స్ గా ఒక రేంజ్ లో విజ్రంభిస్తూనే మరో వైపు వెండితెర మీద కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు చాలామంది అమ్మాయిలు. ఇప్పటికే బుల్లితెర యాంకర్లుగా మంచి పేరు కొట్టేసిన ఉదయభాను, అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి వారు ఇటు యాంకరింగ్ చేస్తూనే మరో వైపు వెండితెర మీద కూడా వెలుగులు జిమ్ముతున్నారు. ఇక ఆమధ్యన ఏ టీవీ ఛానెల్స్ చూసిన ఒక జంట తెగ హల్ చల్ చేసేది. అందులోనూ వారిద్దరి మధ్య ఒక స్నేహమే కాదు ఇంకా ఏదో సంథింగ్ సంథింగ్ అంటూ జోరుగా ప్రచారం జరిగింది కూడా. ఆ జంట యాంకర్స్ ఎవరో మీరు ఈ పాటికే గుర్తుపట్టి ఉంటారే. వారెవరో కాదు రవి- లాస్య ల జోడి . వీరిద్దరూ విడివిడిగా యాంకరింగ్ కన్నా జంట యాంకర్లుగా బాగా పాపులరయ్యారు. అన్ని ప్రముఖ టీవీ షోస్ లో వీరి జంట  దర్శనమిచ్చేది. ఇంకేముంది వీరిమధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు ప్రేమ కూడా ఉందనే విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. కానీ వాళ్లిద్దరూ మాత్రం మా ఇద్దరిమధ్యన కేవలం స్నేహం మాత్రమే.. ఇంకెటువంటి బంధం లేదని తేల్చి చెప్పేవారు.

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా యాంకర్ లాస్య ఏ టీవీ షో లోను కనబడకుండా పోయింది. చాలా రోజులుగా కనబడక పోయేసరికి లాస్య పెళ్లి చేసుకుంది అని... అంతేకాకుండా ఒక యువ హీరోతో పీకల్లోతు ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకుందని ఏవేవో వార్తలు వినిపించాయి. అయితే ఆ రూమర్స్ కి లాస్య సకాలంలో స్పందించి చెక్ పెట్టింది. అయినా ఒక్కసారే లాస్య కనబడకపోయేసరికి ఎవరికి తోచినట్టు వారు ఆమెపై పుకార్లు పుట్టించేసారు. అయితే ఇప్పుడు లాస్య హీరోయిన్ గా కూడా మారుతుందని సమాచారం. అందుకే లాస్య చాలా రోజులనుండి ఎవరికీ కనబడకుండా ఉందని అంటున్నారు. ఈమె హీరోయిన్ గా ట్రై చెయ్యడం మూలం గానే బుల్లితెరని వదిలేసిందని చెబుతున్నారు. మరి యాంకర్ గా ఒక ఊపు ఊపిన లాస్య ఇప్పుడు హీరోయిన్ గా కూడా వెండితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుందన్నమాట . ఇక లాస్య హీరోయిన్ గా వచ్చే సినిమా ఏమిటో తెలుసా...! 'రాజా మీరు కేక’. ఈ సినిమా తోనే లాస్య హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమవుతుందట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ