మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' లో 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అంటూ విడుదల చేసిన ఆడియో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో రచ్చ రచ్చ చేసేస్తుంది. అసలు ఒక టీజర్ గాని ట్రైలర్ గాని యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది అంటే ఒకే గాని కేవలం ఒక ఆడియో సాంగ్ ఇలా యూట్యూబ్ లో 24 గంటల్లో 2 మిలియన్ల వ్యూస్ దాటిపోయి కేక పుట్టించింది. మరి ఇది చిరంజీవి మహిమ లేక దేవిశ్రీ మ్యూజిక్ మహిమోగాని ఇప్పుడు ఈ 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' సాంగ్ మాత్రం 23 లక్షల వ్యూస్ తో యూట్యూబ్ లో టాప్ పొజిషన్ లో కూర్చుంది.
ఇక ఈ ఒక్క పాటే 'ఖైదీ..... ' మీద ఉన్న అంచనాలను అమాంతంగా పెంచేసింది. చిరంజీవి నటనలో 9 ఏళ్ళు గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని వున్నాయి. ఇక మరో పక్క కాజల్ అగర్వాల్ 'ఖైదీ నెంబర్ 150' లో పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో కాజల్ తన అందాలను మాములుగా ఆరబొయ్యలేదని ఈ పిక్స్ చూస్తుంటే అర్ధమైపోతుంది. ఇక మరో పక్క 'ఖైదీ.....' ఆడియో ని భారీ లెవల్లో విజయవాడలో నిరవహిస్తారని వార్తలొచ్చినప్పటికీ..... 'ఖైదీ .... 'ఆడియోని రద్దు చేసి సినిమా రిలీజ్ కి ముందు అంటే జనవరి మొదటి వారం లో ఖైదీ నెంబర్ 150 చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తుందని సమాచారం.