ధోని, రక్త చరిత్ర, లెజెండ్, లయన్, కబాలి ఈ చిత్రాల పేర్లు వింటే వీటన్నిటిలో కామన్ గా ఉండేది కథానాయిక రాధికా ఆప్టేనే. ఈ చిత్రాలలో రాధికా ఆప్టే పోషించింది హుందాగా కనిపించే హోంలీ పాత్రలే తప్ప కమర్షియల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించే పాత్రలు కానీ, సెన్సార్ వారి తిరస్కారానికి గురయ్యే పరిమితులు దాటిన సన్నివేశాలు కాని ఏమి వుండవు. కాబట్టి రాధికా ఆప్టే ను ఫ్యామిలీ కథలకు మాత్రమే ఇమిడిపోయే కథానాయికగా గుర్తిస్తారు మన ప్రేక్షకులు. అయితే బాలీవుడ్ చిత్రాలతో ఏ మాత్రం పరిచయం వున్నా.. ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు ఎవరైనా. రాధికా ఆప్టే ఉత్తరాది చిత్రాలు ఐన హంటర్, పేర్చేద్ వంటి చిత్రాలతో పాటు పలు లఘు చిత్రాలలో చేసిన హంగామా కి అక్కడి ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు.
పేర్చేద్ చిత్రంలో రాధికా ఆప్టే చేసిన నగ్న ప్రదర్శనలు మన సెన్సార్ వారి కత్తెరకు బలైపోయాయి కానీ రాధికా పడ్డ కష్టం మాత్రం వృధా గా పోలేదు. ఇతర దేశాలలో కూడా విడుదలైన ఆ చిత్రం ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ప్రదర్శితమవటంతో రాధికా కు ప్రపంచ స్థాయి గుర్తింపు ఆ ఒక్క చిత్రంతో దొరికింది. నగ్న ప్రదర్శన గురించి ఎప్పుడు ప్రశ్నించినా తనదైన శైలిలో ధీటుగానే సమాధానమిచ్చేది రాధికా ఆప్టే. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావటంతో ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించటానికి మీరు నటించబోయే తదుపరి చిత్రాలలో కూడా మీ నుంచి బోల్డ్ సీన్స్ ఆశించొచ్చా అని అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా..'ఇది మీరు నాకు వేసిన ప్రశ్న అయినప్పటికీ సమాధానం ఇవ్వవలిసింది నేను కాదు. నా వద్దకు వచ్చే కథలు నేను ఎలా కనిపించాలి అనేది నిర్ణయిస్తాయి. కేవలం సినిమా మార్కెట్ పెంచటం కోసమో లేక ప్రపంచ స్థాయిలో నా పేరు వినపడాలనో నా గత చిత్రాలలో బోల్డ్ సన్నివేశాలు బలవంతంగా చేర్చలేదు. కథ ప్రకారం ఏది అవసరం అయితే అదే చేసాను. భవిష్యత్ లోనూ ఏదైనా సామాజిక సందేశం బలంగా చెప్పే కథలో నా పాత్ర నగ్నంగా కనిపించాల్సి వస్తే కనిపించటానికి నేను ఎటువంటి షరతులు విధించను..' అంటూ ధైర్యంగా వెల్లడించింది రాధికా ఆప్టే.