Advertisementt

ఇక ఇప్పుడు చెర్రీ వంతు..!

Wed 21st Dec 2016 06:38 PM
ram charan,dhruva movie,director sukumar,ram charan new movie sukumar direction,different look in this film ram charan,chiranjeevi,khaidi no 150  ఇక ఇప్పుడు చెర్రీ వంతు..!
ఇక ఇప్పుడు చెర్రీ వంతు..!
Advertisement
Ads by CJ

'ధృవ' చిత్రంలో రామ్ చరణ్ సిక్స్  ప్యాక్ బాడీతో పిచ్చెక్కించేసాడు. ఈ చిత్రం ఆధ్యంతం తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించి రామ్ చరణ్ అరిపించేసాడు. అసలు చరణ్ ని అలాంటి లుక్ లో చూసిన అభిమానులకు పిచ్చెక్కేసింది. అసలు ఇలాంటి లుక్ ని ఇంతవరకు రామ్ చరణ్ నుండి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి వుండరు కూడా. అసలు సినిమా మొత్తం అలా జిమ్ బాడీతో రామ్ చరణ్ ఆధ్యంతం అలరించాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా కోసం మరో డిఫ్రెంట్ లుక్ లో మెగా అభిమానులని, ప్రేక్షకులని అలరించబోతున్నాడని టాక్.

సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే లవ్ స్టోరీలో చరణ్ మరోసారి మేకోవర్ తో జనాలకు షాక్ ఇవ్వనున్నాడట. ఆ మేకోవర్ కోసం చరణ్ ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలు పెట్టాడని చెబుతున్నారు. ఆ లుక్ ఎలా వుండబోతుందంటే... గుబురు గెడ్డం, మీసంతో చరణ్, సుకుమార్ చిత్రంలో కనిపిస్తాడని ప్రచారం మొదలైంది. ఇక ఈ లుక్ ని స్టైలిష్ గా తీర్చి దిద్దడానికి బాలీవుడ్ నుంచి స్పెషల్ స్టైలిష్ట్ ను దించినట్లు వార్తలొస్తున్నాయి. మరి సుకుమార్ తన సినిమాలోని హీరోలను ఎదో ఒక డిఫ్రెంట్ లుక్ లో చూపెట్టడం అలవాటే. మహేష్ ని '1  నేనొక్కడినే' లో సిక్స్ ప్యాక్ తో చూపించగా... ఎన్టీఆర్ ని 'నాన్నకు ప్రేమతో' లో డిఫ్రెంట్ గెడ్డం, మాంచి హెయిర్ కట్ తో చూపించాడు. ఇక ఇప్పుడు చరణ్ వంతు. అందుకే చరణ్ ని కూడా గుబురు గెడ్డంతో చూపించడానికి సుకుమార్ రెడీ అవుతున్నాడట.

ఇక రామ్ చరణ్ నిర్మాణం సారధ్యంలో తెరకెక్కుతున్న చిరు 150  వ చిత్ర 'ఖైదీ నెంబర్ 150'  విడుదల కాగానే సుకుమార్, చెర్రీ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ తోనే ప్రేక్షకులకి పెద్ద షాక్ ఇచ్చేలా సుకుమార్, చెర్రీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ