Advertisementt

కాసేపు కమెడియన్‌ అని మరచిపోండి..!

Thu 22nd Dec 2016 05:42 PM
saptagiri,saptagiri express movie,comedian saptagiri,hero saptagiri charector in this movie saptagiri express  కాసేపు కమెడియన్‌ అని మరచిపోండి..!
కాసేపు కమెడియన్‌ అని మరచిపోండి..!
Advertisement
Ads by CJ

కమెడియన్‌లు హీరోలుగా మారినప్పుడు చెప్పే డైలాగ్‌ ఇది. సినిమా ఎంతో కష్టపడి తీశాం. ఇన్నాళ్లు కమెడియన్‌గా ఎంతో ఆదరించారు. హీరోగా మీ ముందుకు వస్తున్నాను. ఒక్కసారి కమెడియన్‌ అనే విషయం మరిచిపోయి, నిజమైన హీరోని ఎలా చూస్తారో..అలా ఫీలై సినిమా చూడండి..తప్పకుండా మీకు నచ్చుతుంది. అని కమెడియన్‌ నుండి హీరోగా మారిన ప్రతి నటుడు చెప్పే మాటలే ఇవి. ఇవే మాటలు ఇప్పుడు 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' చిత్రంతో హీరోగా మారిన కమెడియన్‌ సప్తగిరి చెబుతున్నాడు. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్‌ 23న ధియేటర్లలోనికి వచ్చేందుకు సిధ్దమైంది. 

మరి ఇప్పటికే ఎందరో కమెడియన్లు..హీరోలుగా మారి..సక్సెస్‌ కాలేక మళ్లీ కామెడీనే నమ్ముకుంటున్న తరుణంలో, అందర్నీ చూస్తూ కూడా సప్తగిరి చేస్తున్న ఈ ప్రయోగానికి నిజంగా హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. అయితే కమెడియన్‌లు హీరోల అవతారం ఎత్తినప్పుడు ముఖ్యంగా ఇతర సినిమాల స్ఫూఫ్‌లని ఎక్కువగా నమ్ముకుంటారు. అయితే ఈ సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో మాత్రం ఒక్క స్ఫూఫ్‌ కూడా ఉండదని సప్తగిరి మాటిస్తున్నాడు. అందుకే కమెడియన్‌ అనే విషయం మర్చిపోయి..ఈ సినిమా చూస్తే..తప్పకుండా ఓ గొప్ప సినిమా చూశామనే అనుభూతి మీకు ఇస్తానని చెబుతున్నాడు. అంతా బాగానే ఉంది కానీ..సప్తగిరిని ఎదురుగా చూస్తూ..కమెడియన్‌ అనే పదం ఎలా మరిచిపోతారో..అనేదే ఇప్పుడు అర్ధం కావడం లేదు. 'ఏం అక్కా..ఇంకో రౌండేసుకుంటావా..' అనే డైలాగ్‌.. సప్తగిరి ముఖం చూసిన ప్రతిఒక్కరికీ గుర్తొస్తూనే ఉంటుంది. అలాంటిది..అనుభూతి కోసం మరిచిపోమంటే మరిచేదెలా..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ