Advertisementt

తైమూర్ తో మీకేంటి ప్రాబ్లెమ్..అంటూ బూతులు!

Fri 23rd Dec 2016 09:13 PM
rishi kapoor,kareena kapoor,saif ali khan,taimur ali khan,taimur ali khan name controversy  తైమూర్ తో మీకేంటి ప్రాబ్లెమ్..అంటూ బూతులు!
తైమూర్ తో మీకేంటి ప్రాబ్లెమ్..అంటూ బూతులు!
Advertisement
Ads by CJ

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కి పండంటి మగబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. పెళ్ళై, పిల్లలున్న, వయసులో పెద్దవాడైన  సైఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి కరీనా పెళ్లాడింది. ఇక ఇప్పడు సైఫ్ బిడ్డకి తల్లయింది. అయితే తల్లి తండ్రిలైన సైఫ్, కరీనా లు తమ బిడ్డకి ప్రేమతో తైమూర్ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు తైమూర్ అనే పేరే పెద్ద రచ్చయింది. పుట్టిన వెంటనే పేరు పెట్టడం... అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ లా పాకిపోవడం.... ఆ పేరు మీద పెద్ద రచ్చ జరగడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఇప్పుడు దేశం మొత్తం మీద కరీనా, సైఫ్ ల బుడ్డోడు తైమూర్ గురించే చర్చ నడుస్తుంది. 

తైమూర్ గురించి అంత పెద్ద రచ్చ ఎందుకు జరుగుతుందంటే తైమూర్ అనే ఒక రాజు రాజ్యకాంక్షతో ఎంతోమందిని చంపి రక్తాన్ని ఏరులై పారించాడు. ఆ చనిపోయిన వారిలో హిందువులే ఎక్కువమంది ఉన్నారనేది ఆ చర్చలో సారాంశం. మరి అంతలా హింసని ప్రేరేపించిన తైమూర్ రాజు పేరు సైఫ్, కరీనా తమ బిడ్డకి ఎలా పెట్టారని వాదిస్తున్నారు. అలాగే కడుపుమండిన చాలామంది కరీనా, సైఫ్ కొడుకు ఏదైనా వ్యాధి బారిన పడి చనిపోతే బావుండు అని శాపనార్ధాలు కూడా పెట్టేస్తున్నారు. మరి ఇప్పటివరకు ఈ విషయం పై సైఫ్ కానీ కరీనా కానీ స్పందించలేదు.

కానీ కరీనా కి పెదనాన్న వరసైన రిషి కపూర్ మాత్రం సైఫ్, కరీనా ల కొడుకు తైమూర్ పై వస్తున్న కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్నాడు. వారి కొడుక్కి వారు తమ కిష్టమైన పేరు పెట్టుకుంటే మీకేమైంది. ఈ లోకం పుట్టిన పిల్లలకి పేరు పెట్టుకునే స్వేచ్ఛ ప్రతి తల్లితండ్రులకు వుంది. దీనిపై ఆర్గుమెంట్స్ చేయడానికి మీరెవరు. అలెగ్జాండర్, సికిందర్ వంటి పేర్లు ప్రపంచం లో మోగిపోతున్నప్పుడు..తైమూర్ కి ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఆ పేరుతో మీకేంటి ప్రాబ్లెమ్? ఒళ్ళు దగ్గర పెట్టుకోండి... అంటూ బూతుల దండకం చదివేశాడు.

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ మాత్రం మాకేం ఇవేం పట్టవ్ అన్నట్లు పుట్టిన బిడ్డతో చాలా హ్యాపీ మూమెంట్స్ ని అనుభవిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ