Advertisementt

టాలీవుడ్‌ హీరోల మైల్‌స్టోన్స్‌...!

Sat 24th Dec 2016 03:19 PM
mega star chiranjeevi,khaidi no 150,balakrishna 100 movie gautamiputra satakarni,victory venkatesh 75 movie upcoming,mahesh babu 25 movie upcoming  టాలీవుడ్‌ హీరోల మైల్‌స్టోన్స్‌...!
టాలీవుడ్‌ హీరోల మైల్‌స్టోన్స్‌...!
Advertisement
Ads by CJ

ఏ స్టార్‌కైనా, హీరోకైనా 25, 50, 75, 100,150 వంటి చిత్రాలు మైల్‌స్టోన్స్‌ అన్న సంగతి తెలిసిందే కాగా ప్రస్తుతం పలువురు టాలీవుడ్‌ సీనియర్‌స్టార్స్‌, యంగ్‌స్టార్స్‌తో పాటు పలు హీరోలు ఈ మైలురాళ్లకు చేరువవుతుండగా, మరికొందరు తాజాగానే వాటిని చేరుకున్నారు. సీనియర్‌స్టార్స్‌ అయిన చిరు, బాలయ్య, వెంకీలు ఇలాగే కొన్ని మైల్‌స్టోన్‌ చిత్రాలకు దగ్గరగా ఉన్నారు. మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెంబర్‌ 150', బాలయ్య వందో చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లు సంక్రాంతికి విడుదలకానున్న సంగతి విదితమే. ఇక వెంకటేష్‌ విషయానికి వస్తే ఆయన తాజాగా నటిస్తున్న 'గురు' చిత్రం ఆయనకు 73వ చిత్రం. 

త్వరలో ప్రారంభంకానున్న 'నేను...శైలజ' ఫేమ్‌ కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన తన 74వ చిత్రంగా 'ఆడాళ్లు.. మీకు జోహార్లు' చేస్తున్నాడు. ఇక తన 75వ చిత్రాన్ని క్రిష్‌ దర్శకత్వంలో చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తన 25వ చిత్రం మైలురాయికి రెండడుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన మురుగదాస్‌తో చేస్తున్న చిత్రం 23వది. కొరటాల శివతో 24వ చిత్రం, వంశీపైడిపల్లితో 25వ చిత్రం చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సుకుమార్‌తో చేసిన 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో 25 చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. అల్లరినరేష్‌ నటించి, కిందటి ఏడాది విడుదలైన 'మామ మంచు.. అల్లుడు కంచు' చిత్రంతో 50 చిత్రాల మైలురాయిని అందుకున్నాడు. మరో యంగ్‌ అండ్‌ అప్‌కమింగ్‌ హీరో శర్వానంద్‌ కూడా తన 25వ చిత్రం మైలురాయికి చేరువలోనే ఉన్నాడు. 

ఆయన నటించి, విడుదలకు సిద్దమవుతున్న 'శతమానం భవతి' చిత్రం ఆయనకు 24వ చిత్రం. ఇప్పటికే ఆయన నటిస్తోన్న 25 చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. నూతన దర్శకుడు చంద్రమోహన్‌ డైరెక్షన్‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాతగా ఆయన నటిస్తోన్న చిత్రం 25వ సినిమాగా విడుదల కానుంది. ఇందులో శర్వా పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడట. ఇక మరో యంగ్‌ హీరో నితిన్‌ ప్రస్తుతం హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇది ఆయనకు 24వ చిత్రం. కాగా ఇటీవలే ముహూర్తం జరుపుకున్న పవన్‌-త్రివిక్రమ్‌ల భాగస్వామ్యంలో తాను కూడా నిర్మాణభాగస్వామిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో సెట్స్‌పైకి వెళ్లనున్న చిత్రం ఆయనకు25వ చిత్రంగా నిలవనుంది. వీరితో పాటు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌లు కూడా 25 చిత్రాల మైలురాళ్లకు చేరువగా ఉన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ