యంగ్‌టైగర్ ఎన్‌టిఆర్..జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత తీసుకున్న గ్యాప్ కారణంగా ఈ మధ్య వార్తల్లో నిలుస్తున్నాడు. సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్ర దర్శకుడు బాబీతో సినిమా ఓకే చేయడంతో మరోసారి ఎన్‌టిఆర్ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఇది సినిమాల పరంగా ఎన్‌టిఆర్ గురించి జరుగుతున్న చర్చ. అయితే తాజాగా ఎన్‌టిఆర్ రాజమండ్రిలో తళుక్కున మెరవడంతో..టాపిక్ అంతా ఇప్పుడు ఆంధ్ర వైపు మళ్లీంది. ఇటీవలే పవన్‌కళ్యాణ్ ఏలూరులో ఓటు హక్కు కోసం అప్లయ్ చేయడం, అతి త్వరలో ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌లోకి అడుగుపెడుతుండటంతో..తాజాగా ఇప్పుడు ఎన్‌టిఆర్ రాజమండ్రి నుండి కాకినాడ వెళ్ళడం వెనుక రాజకీయ చర్చలు విపరీతంగా జరుగుతున్నాయి.
అయితే ఎన్‌టిఆర్ కాకినాడ వెళ్లడం వెనుక అసలు ఎటువంటి రాజకీయ కహానీ లేదన్నది వాస్తవం. అసలు వాస్తవం ఏమిటంటే ఎన్‌టిఆర్ కాకినాడ వచ్చింది కేవలం తన అన్న కుమారుడు పంచెల ఫంక్షన్ కోసమని తెలుస్తుంది. ఇటీవల యాక్సిడెంట్‌లో మరణించిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ కుమారుడు ఎన్‌టిఆర్ (రీసెంట్‌గా వచ్చిన దానవీరశూరకర్ణ చిత్రంలో నటించాడు) పంచెల ఫంక్షన్ కాకినాడలో జరిగింది. ఈ ఫంక్షన్ కోసం ఎన్‌టిఆర్‌తో పాటు హరికృష్ణ, కళ్యాణ్‌రామ్‌లు కూడా హాజరైనట్లు తెలుస్తుంది. సో..ఎన్‌టిఆర్ కాకినాడ ట్రిప్ వెనుక ఎటువంటి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం తన ఫ్యామిలీ ఫంక్షన్ కోసమే ఎన్‌టిఆర్ కాకినాడ వచ్చాడనేది క్లియర్.