తాజాగా తమిళ 'తని ఒరువన్' రీమేక్ 'ధృవ' వంటి క్లాస్ చిత్రంలో నటించాడు రామ్‌చరణ్. త్వరలో ఆయన సుకుమార్‌తో చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం సైన్స్‌ఫిక్షన్ అని, టైమ్ మెషీన్ ఆధారంగా తెరకెక్కుతుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రంలో చరణ్ ఓ చెవిటివాడిపాత్రలో నటించనున్నాడని, సినిమా మొత్తం గ్రామీణ నేపథ్యంలో సాగుతుందని, ఇదో ఎక్స్‌పెరిమెంట్ మూవీ అంటూ ప్రచారం మొదలైంది. దీంతో 'ధృవ' తర్వాత చరణ్‌కున్న మాస్ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశతప్పదేమో అని కొందరు భయపడ్డారు. కానీ ఈ చిత్రంపై చరణ్ ఇచ్చిన క్లారిటీతో ఆయన అభిమానులు ఇప్పుడు ఊపిరిపీల్చుకున్నారు.
ఈ చిత్రం గురించి చరణ్ తాజాగా మాట్లాడుతూ, ఇది ఎక్స్‌పెరిమెంటల్ మూవీకాదు. వస్తున్న పుకార్లను, వార్తలను అసలు నమ్మవద్దు, ఈ చిత్రం '1' (నేనొక్కడినే) తరహాలో సైంటిఫిక్ థ్రిల్లర్ కాదు. 'నాన్నకు ప్రేమతో' లాగా ఫారిన్ స్టైల్‌లో ఉండదు. 'ఆర్య2' లాగా టిపికల్ క్యారెక్టరైజేషన్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో జరిగే కథ.. ఇది సేఫ్ ప్రాజెక్ట్.. అని తెలపడంతో చరణ్ అభిమానులు ప్రస్తుతానికి కుదుటపడ్డారు. కాగా ఈ చిత్రం కోనసీమ గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ అచ్చమైన, సింపుల్ ప్రేమకథ మాత్రమే అని విశ్వసనీయ సమాచారం.