సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మురగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటికే 70 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి న్యూస్ బయటికి రాలేదు. మధ్యలో ఈ సినిమాకి టైటిల్ ఇదని చాలా పేర్లు వినిపించినా..అధికారికంగా మూవీ యూనిట్ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి విషయాన్ని రిలీజ్ చేయలేదు. అయితే ఈ జనవరి 1కి టైటిల్‌తో పాటు చిన్న టీజర్ కూడా వస్తుందని మూవీ యూనిట్‌పై అభిమానులు ఎంతో ఆశపెట్టుకుని ఉన్నారు. చూస్తుంటే జనవరి 1కి కూడా అభిమానుల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.
అవును జనవరి 1కి కూడా ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి న్యూస్ బయటికి వచ్చేలా కనిపించడం లేదు. దీనికి కారణం ఈ చిత్రంలో నటిస్తున్న ప్రియదర్శి చెబుతున్న మాటలే. ఇంతకీ అతను ఏం చెబుతున్నాడని అనుకుంటున్నారు కదా..! అసలింతకీ ప్రియదర్శి ఎవరనుకుంటున్నారు. ఇటీవల పెళ్ళిచూపులు చిత్రంలో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రియదర్శికి మహేష్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. అతన్ని ఈ సినిమా గురించి అడుగగా..మహేష్ అభిమానుల కోసం మురుగదాస్ ఓ అద్భుతమైన విజువల్ వండర్‌ని తెరకెక్కిస్తున్నాడు. అటువంటి అద్భుతం గురించి తెలుసుకోవడానికి కాస్త వెయిట్ చేయకతప్పదు అంటూ సెలవిచ్చాడు. సో..ప్రియదర్శి చెబుతున్న మాటల్ని బట్టి..ఈ మూవీ గురించి తెలియడానికి ఇంకొంత కాలం వెయిట్ తప్పదని మాత్రం తెలుస్తుంది.