అందాన్ని, అభినయాన్ని సమపాళ్లలో రంగరించి.. తన నటనతో, గ్లామర్‌తో బాలీవుడ్లో స్టార్హీరోయిన్గా నిలిచిన నటి ప్రియాంకాచోప్రా. ఆమె గ్లామర్‌షో విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తుంది. చూపించి, చూపించనట్లుగా అందాలను తనదైనశైలిలో విమర్శలకు తావులేకుండా ప్రదర్శిచడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కాగా బాలీవుఢ్‌లో నెంబర్‌వన్‌గా వెలుగుతున్న సమయంలో ఆమె 'క్వాంటికో' అనే సీరియల్ ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె హాలీవుడ్ మూవీ 'బేవాచ్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో దీపికాపడుకొనేకు గట్టిపోటీ ఇచ్చిన ఆమె ప్రస్తుతం హాలీవుడ్లో కూడా దీపికాతో పోటీపడుతోంది. కాగా ఆమెకు సెక్స్సింబల్ ఇమేజ్ వచ్చింది. ఆ విషయం గురించి ఆమె మాట్లాడుతూ, అలాంటి ఇమేజ్ వచ్చినందుకు నేనేమీ నామోషీగా ఫీల్‌కావడం లేదు. దాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకుంటున్నాను. కానీ శృంగార తారగా వెలగాలని, ఆ ఇమేజ్ తెచ్చుకోవడం కోసం మాత్రం నేనేమీ ప్రయత్నించలేదు. కథ, సన్నివేశాలు డిమాండ్ చేస్తే అలా కనిపించడంలో తప్పులేదు అని చెప్పుకొచ్చింది. కాగా ఆమె 'బేవాచ్' చిత్రానికి ముందే బికినీలో అదరగొట్టింది. హాలీవుడ్లో చాన్స్ వచ్చిన తర్వాత తన ఫిజిక్‌పై మరింత శ్రద్దపెట్టి, మరింత స్లిమ్‌గా తయారై అందాలను ఆరబోస్తోంది. ఇటీవల ఆమె ఇంటర్నేషనల్ మేగజైన్ 'ఎస్కైర్' కవర్‌పేజీ కోసం ఇచ్చిన ఫోజులతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.