Advertisementt

మరో క్రేజీ ప్రాజెక్టుతో పెళ్ళి చూపులు హీరో..!

Wed 28th Dec 2016 09:48 PM
pelli choopulu,vijay devarakonda,kranthi madhav,ks rama rao  మరో క్రేజీ ప్రాజెక్టుతో పెళ్ళి చూపులు హీరో..!
మరో క్రేజీ ప్రాజెక్టుతో పెళ్ళి చూపులు హీరో..!
Advertisement
Ads by CJ

ఈ యేడాదిలో అతి తక్కువ బడ్జెట్ లో తీసి భారీస్థాయిలో వసూళ్ళు చేసిన సినిమా పెళ్ళి చూపులు. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్కసారిగా తిరుగులేని స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఒకటి తర్వాత ఒకటి అలా చేసుకుంటూ పోతున్నాడు విజయ్ దేవర కొండ. కాగా విజ‌య్ తాజాగా న‌టించిన ద్వార‌క చిత్రం అతి త్వరలోనే విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండకు మరో కొత్త క్రేజీ ప్రాజెక్టు తన ముందు వాలిపోయింది. అదేమంటే... ఓన‌మాలు, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాలు చేసిన క్రాంతిమాధ‌వ్‌తో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ చిత్రానికి కె.ఎస్.రామారావు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించనున్నాడు. విచిత్రం ఏంటంటే... మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు చిత్రానికి కూడా కె.ఎస్‌.రామారావే నిర్మాత‌. ఆ సమయంలో మరో సినిమా తనతో చేయడానికి క్రాంతితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఈ సమయంలో విజ‌య్ దేవ‌ర కొండ‌తో ప్రాజెక్టును కూడా ఈయన సెట్ చేసినట్లు పరిశ్రమ వర్గాల టాక్.

ప్ర‌స్తుతం.. క్రాంతి మాధ‌వ్ హీరో సునీల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఉంగ‌రాల రాంబాబు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం పూర్తయిన వెంటనే విజయ్ దేవరకొండతో క్రాంతి మాధ‌వ్ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ