జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఏ వార్త వచ్చినా అది వైరల్ అయిపోతుంది. సంచలనాలకు దారితీస్తుంది. అదేంటో ఆయన ఏం చేసినా అది అలాగే అవుతుందనుకో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ తీరిక లేకుండా పనిచేస్తున్న విషయం తెలిసిందే. పవన్ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా కొత్త సంవత్సరాన్ని 2017ను పురస్కరించుకొని కాటమరాయుడు చిత్రానికి గాను కొత్త పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫ్యాక్షనిస్టు ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తగినట్లుగా అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చాడు.
కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల అయిన ఈ పోస్టర్ లో... వెనకాల అంతా బాంబులు పేలుతున్న వాయువుతో ఉండగా... ఆ మధ్యలోంచి పవన్ పంచకట్టుతో సగభాగం మాత్రమే కనిపిస్తూ నడుస్తున్న ఫోటోను వదిలింది చిత్ర యూనిట్. పవన్ ఈ ఫోటోలో సగమే దర్శనమిస్తున్నాడు. ఇలా ఊరించి పూర్తిస్థాయి పంచకట్టులో పవన్ మిగతా సగ భాగం కొత్త సంవత్సరంలో విడుదల చేస్తారు కాబోలు. మొత్తానికి పవన్ ను పంచకట్టులో చూసి తెగ మురిసిపోతున్నారు పవర్ స్టార్ అభిమానులు. క్లాసైన మాస్ తీరులో పక్కా సగం వరకు పైకి ఎగకట్టి నడుస్తున్న పోస్టర్ విత్ ఇన్ సెకన్స్ లోనే టాప్ ట్రేడింగ్ లో దూసుకుపోయింది ఈ పోస్టర్. పవన్ ను సగం వరకు చూసే ఇంత వైరల్ సృష్టిస్తే ఇంక పూర్తి స్థాయిలో చూపితే ఇంకెంత వైరల్ అవుతాడో అంటున్నారు సినీ విమర్శకులు.