ఆమధ్య మెగాహీరో బన్నీ పవన్‌కళ్యాణ్ గురించి మాట్లాడమంటే వారిని అవమానించేలా 'చెప్పను బ్రదర్' అని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి బన్నీ వైజాగ్స్ ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ, 'ఈ సంక్రాంతి మనదే బ్రదర్' అని వ్యాఖ్యానించడంపై నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఒకవైపు దర్శకుడు క్రిష్ 'ఖబద్దార్' అనే పదాన్ని మెగాహీరోలను ఉద్దేశించి అనలేదని వివరణ ఇచ్చి అందరినీ శాంతింపజేస్తున్న తరుణంలో బన్నీ వ్యాఖ్యలు మరోసారి అందరినీ రెచ్చగొట్టే విధంగా ఉండటం బాధాకరం. కాగా ప్రస్తుతం బాలయ్య, చిరులు తమ చిత్రాల రిలీజ్ డేట్ విషయంలో మైండ్‌గేమ్ ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నేడున్న పరిస్థితుల్లో టాలీవుడ్‌లో కూడా మొదటి రోజే దాదాపు 20కోట్లు వసూలు చేయగల సత్తా మన స్టార్స్‌కి వచ్చింది. దీంతో ముందుగా బాలయ్య, చిరులలో ఎవరు తమ సినిమా రిలీజ్‌డేట్‌ను ప్రకటిస్తారో చూసి,.. ఆ తర్వాత ఒకరోజు ముందుగా తమ చిత్రం విడుదలయ్యేలా ఇద్దరు సీనియర్‌స్టార్స్ వ్యూహాలు రచిస్తున్నారంటున్నారు. మరోపక్క ఈ రెండు చిత్రాలు పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాయి. 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటంతో ఈచిత్రం కాస్త ఆలస్యంగా అంటే జనవరి5న సెన్సార్‌కు వెళ్లుతుందని, కానీ చిరు 'ఖైదీ.... 'చిత్రం మాత్రం ఈ రోజే సెన్సార్‌కు వెళ్లనుందని సమాచారం. మరి ఈ రెండు చిత్రాలలో దేని రిలీజ్ డేట్‌ను ముందుగా ప్రకటిస్తారో వేచిచూడాల్సివుంది.