Advertisementt

కళ్యాణ్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి..!

Thu 29th Dec 2016 09:45 PM
social media,hero ntr,kalayan ram,director babi,producer kalyan ram,ntr arts banner  కళ్యాణ్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి..!
కళ్యాణ్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి..!
Advertisement
Ads by CJ

మీడియా అన్న తర్వాత మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వివిద పుకార్లు రావడం అనేది అతి సహజం. వాటిల్లో కొన్నివాస్తవాలు ఉండవచ్చు... మరి కొన్ని కేవలం గాసిప్స్‌ మాత్రమే కావచ్చు. అయితే ఇటీవల సినీ పరిశ్రమలో మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో ఓ విచిత్రమైన ట్రెండ్‌ కనిపిస్తోంది. ఓ చిత్రం ప్రారంభానికి ముందే చిత్ర యూనిట్టే కొన్ని విషయాలను లీక్‌ చేస్తోంది. తమ చిత్రంలో ఏ హీరోయిన్‌ని అనుకుంటున్నారు? చిత్రానికి ఏ టైటిల్‌ అయితే బాగా ఉంటుంది? అనే సందేహంతో పలు విషయాలను వారే మీడియాకు లీక్‌ చేసి, అభిమానుల స్పందనను సీక్రెట్‌గా తెలుసుకుంటున్నారు. 

కాగా త్వరలో 'టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్‌' వంటి హ్యాట్రిక్‌ హిట్స్‌ తర్వాత ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని బాబి దర్శకత్వంలో తన అన్నయ్య కల్యాణ్‌రామ్‌ సొంతబేనర్‌ అయిన ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో చేయనున్నాడు. ఈ చిత్రంలోని టెక్నీషియన్స్‌, హీరోయిన్స్‌తో పాటు పలు టైటిల్స్‌ కూడా ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తాడనే వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో నిర్మాత కళ్యాణ్‌రామ్‌ వెంటనే రియాక్ట్‌ అయ్యాడు. 

తాను నిర్మాతగా, బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రం మాత్రమే ఫైనల్‌ అయిందని, మిగిలిన విషయాలేమీ కన్‌ఫర్మ్‌ కాలేదని, కాబట్టి వాటిని నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశాడు. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. కానీ చాలా మంది దర్శకనిర్మాతలు, హీరోలు మాత్రం తమ చిత్రాలపై ఎన్నో వార్తలు వస్తూ, ఫ్యాన్స్‌ను అయోమయంలోకి నెడుతున్నప్పటికీ కనీసం  ఓ ట్వీట్‌ ద్వారా కూడా వాటిని ఖండించకుండా, సరదా చేస్తున్నట్లు చూస్తూ, అందరినీ పిచ్చివారిని చేస్తున్నారు. ఈ విషయంలో కళ్యాణ్‌రామ్‌ స్పందనను పాజిటివ్‌గా, ఆదర్శంగా తీసుకోవడం అందరికీ అవసరం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ