పలువురు తారలు క్రిస్ట్మస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ విదేశాల్లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు చాలామందే ఇలా క్రిష్ట్మస్ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ లో అయితే మహేష్ బాబు తన ఫ్యామిలీతో పాటు తన బావ ఫ్యామిలితో కలిసి క్రిష్ట్మస్, న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకుంటుండగా.... మరో తెలుగు టాప్ హీరో రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ లవ్ బర్డ్స్ సమంత- నాగ చైతన్యలు కూడా ఈ వెకేషన్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. క్రిష్ట్మస్ తో పాటు న్యూ ఇయర్ ని కూడా వీరు జంటగానే ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే వారు డేటింగ్ లో బిజీ బిజీ గ గడుపుతున్నారు. ఇక ఇప్పుడు ఈ వెకేషన్స్ ని కూడా మాములుగా సెలెబ్రేట్ చేసుకోవడం లేదని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫొటోస్ ని బట్టి అర్ధమవుతుంది. ఇక సమంత తన స్విమ్ షూట్, షార్ట్ డ్రెస్ అందాలతో మత్తెకించేస్తుంది.
అయితే టాలీవుడ్ తారలు మాత్రమే ఈ క్రిష్ట్మస్, న్యూ ఇయర్ వేడుకల్ని ఎంజాయ్ చెయ్యడం లేదు.... కోలీవుడ్ తారలు కూడా ఈ వేడుకల్ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. వీరిలో తమ్ముడు పవన్ తో సర్దార్ చిత్రంలో, ఇప్పుడు అన్న చిరు ఖైదీ నెంబర్ 150 కి ఐటెం సాంగ్ లో ఆడి పాడిన లక్ష్మి రాయ్ కూడా ఈ వెకేషన్స్ ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తునట్టు కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అమ్మడు అలా బీచ్ ఒడ్డున నడుస్తూ ఫొటోలకి ఫోజులిచ్చింది. ఇక బాలీవుడ్ లో కూడా హృతిక్ రోషన్ వంటి అగ్ర హీరో కూడా తన పిల్లలు మాజీ భార్యతో ఈ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్యకి విడాకులిచ్చినా కూడా ఆమె హృతిక్ కి మంచి ఫ్రెండ్ కావడంతో ఇప్పుడు ఇద్దరూ తమ పిల్లలతో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు ఎగిరిపోయారు. ఇక ఇలా ఎంజాయ్ చేస్తున్న వారిలో చాలామంది తారలే ఈ లిస్ట్ లో వున్నారు.