Advertisementt

అనుకోని వివాదంలో 'దంగల్‌'..!

Fri 30th Dec 2016 05:42 PM
aamir khan,babitha,geetha,regiling champion,dangal movie,coach,p r sodhi  అనుకోని వివాదంలో 'దంగల్‌'..!
అనుకోని వివాదంలో 'దంగల్‌'..!
Advertisement
Ads by CJ

రెజ్లర్‌ మహావీర్‌ పొగట్‌ తన ఇద్దరు కూతుళ్లయిన బబిత, గీతలను రెజ్లింగ్‌ ఛాంపియన్లుగా తీర్చిదిద్దిన వైనాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన చిత్రం 'దంగల్‌' ఎన్నో ప్రశంసలతో పాటు దుమ్మురేపే కలెక్షన్లను కూడా సాధిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంపై ప్రముఖ రెజ్లింగ్‌ కోచ్‌ పీఆర్‌ సోధి తీవ్ర విమర్శలు సంధించి, ఈ చిత్రం విషయంలో న్యాయపోరాటానికి సిద్దమవుతున్నాడు. ఈయన బబిత, గీతలకు 2010లో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో జాతీయ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ చిత్రంలో క్లైమాక్స్‌లో నెగటివ్‌గా చూపించే కోచ్‌ పాత్ర తనదేనని ఆయన మండిపడుతున్నాడు. 

ఈ విషయంలో ఆయన అమీర్‌, డైరెక్టర్‌ నితీష్‌తివారిలను తీవ్రంగా విమర్శిస్తున్నాడు. మహావీర్‌ తనకు చాలా మంచి మిత్రుడని, కావాలంటే ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులను అడిగినా చెబుతారంటున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహావీర్‌ కూతుర్లయిన బబిత, గీతలకు మహావీర్‌ మాత్రమే కాకుండా నలుగురు కోచ్‌లు ఉన్నారు. వారిని చిత్రంలో ఎందుకు చూపించలేదు. ఇక క్లైమాక్స్‌లో గీత ఫైనల్‌ మ్యాచ్‌ను ఆయన తండ్రి చూడకుండా ఓ గదిలో బందించినట్లు చూపించారు. నా పాత్రను ఎంతో ఇగో ఉన్నట్లుగా నెగటివ్‌గా చిత్రీకరించారు. నేను మహావీర్‌ కూతుర్లకు శిక్షణ ఇచ్చే సమయంలో మహావీర్‌ అసలు జోక్యం చేసుకోలేదు. 

ఆయన ఎంతో మంచివాడు. కానీ ఈ చిత్రంలో మాత్రం తన పాత్ర బబితను తప్పుదారి పట్టించే విధంగా, ఆయన తండ్రి రెజ్లింగ్‌ విషయంలో చెప్పిన కిటుకులకు నేను అడ్డుపడ్డట్లుగా చూపించారు.ఇలా నన్ను వక్రీకరించి చెడుగా చూపి, వాస్తవాలు చూపించకుండా తనలాంటి వారిని మానసిక క్షోభకు గురిచేయడం సమంజసం కాదు. ఈ విషయంలో నేను న్యాయపోరాటం చేయనున్నానని ఈ 70ఏళ్ల సోధి ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఈ చిత్రం ప్రారంభంలోనే మహావీర్‌, బబిత, గీతల పాత్రలు తప్ప మిగిలినవన్నీ కల్పితం అని కూడా వేశారు. దీంతో సోధి చేసే న్యాయపోరాటం ఫలించే సూచనలు కనిపించడం లేదని బి-టౌన్‌ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ