Advertisementt

సీనియర్‌ హీరోయిన్లు మళ్లీ వచ్చేస్తున్నారు..!

Sat 31st Dec 2016 06:56 PM
senior heroines,back again,nadiya,kushboo,jyothika,namitha  సీనియర్‌ హీరోయిన్లు మళ్లీ వచ్చేస్తున్నారు..!
సీనియర్‌ హీరోయిన్లు మళ్లీ వచ్చేస్తున్నారు..!
Advertisement
Ads by CJ

కొరటాల శివ 'మిర్చి', త్రివిక్రమ్‌ తీసిన 'అత్తారింటికి దారేది' చిత్రాలతో సీనియర్‌ హీరోయిన్‌ నదియాకు ఎక్కడ లేని క్రేజ్‌ వచ్చింది. ఇక దాదాపు దశాబ్దం కిందట చిరు నటించిన 'స్టాలిన్‌' చిత్రంలో చిరుకు సోదరిగా నటించిన అలనాటి తెలుగు, తమిళ చిత్రాల హీరోయిన్‌, మరీ ముఖ్యంగా తమిళ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి ఏకంగా గుడులు నిర్మించేంత క్రేజ్‌ తెచ్చుకున్న నటి ఖుష్భూ, ఇప్పుడు తాజాగా పవన్‌-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో కీలకపాత్ర పోషించనుంది. 'అత్తారింటికి దారేది'తో నదియాకు పెద్ద బ్రేక్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌ ఈ చిత్రం ద్వారా ఖుష్బూను కూడా మరలా బిజీ నటిగా చేస్తాడనే నమ్మకం చాలా మందికి ఉంది. ఇక ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నగ్మా సోదరి జ్యోతిక.. సూర్యను పెళ్లాడిన తర్వాత తన పిల్లల పెంపకంతోనే బిజీ అయి సినిమాలకు దూరమైంది. తాజాగా ఆమె లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల ద్వారా, తన భర్త సూర్య ప్రోత్సాహంతో సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈమె హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు తమిళ ఇలయదళపతి విజయ్‌తో రెండు సూపర్‌హిట్‌ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆమె విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న విజయ్‌ 61వ చిత్రంలో ఓ కీలకపాత్రలో విజయ్‌కు పెయిర్‌గా నటించనున్నది వార్తలు వస్తున్నాయి. ఈచిత్రంలో సమంత, కాజల్‌అగర్వాల్‌లు కూడా నటించనున్నారని సమాచారం. 

ఇక తెలుగు, తమిళంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నమిత కూడా మరోసారి తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ను రీస్టార్ట్‌ చేయనుంది. బొద్దుగుమ్మగా తమిళుల ఆరాధ్యదైవంగా కీర్తి తెచ్చుకున్న ఆమె ఆమధ్య 'జగన్మోహిని' చిత్రంలో కూడా నటించింది. ఆమె 2010లో వచ్చిన బాలయ్య నటించిన 'సింహా' చిత్రంలో ఓ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈభామ మరలా తమిళ్‌, తెలుగులలో క్రేజ్‌ తెచ్చుకోవాలని ఆశపడుతోంది. అందులో భాగంగా ఆమె కొత్త దర్శకుడు రాజ్‌కుమార్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న 'గుంటూరుటాకీస్‌2'లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా నిన్నటితరం క్రేజీ హీరోయిన్స్‌ ఇప్పుడు మరలా సినిమాలలో బిజీ కావాలని తాపత్రయపడుతూ, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లుగా నటనకు మంచిస్కోప్‌ ఉన్న చిత్రాలలో నటించాలని నిర్ణయించుకుని, క్యారెక్టర్‌ ఆరిస్టులుగా వెండితెరకు నిండుదనం తెచ్చే ప్రయత్నాల్లో ఉండటం హర్షించదగ్గ నిర్ణయమే అని చెప్పాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ