Advertisementt

నాగ్ అశ్విన్ తీవ్ర ఆలోచనలో వున్నాడు..!

Tue 03rd Jan 2017 06:43 PM
producer nag aswin,mahanati savitree movie,keerthy suresh,nithya menon,vidya balan  నాగ్ అశ్విన్ తీవ్ర ఆలోచనలో వున్నాడు..!
నాగ్ అశ్విన్ తీవ్ర ఆలోచనలో వున్నాడు..!
Advertisement
Ads by CJ

తెలుగులో 'మహానటి సావిత్రి' బయోపిక్ ని తెరకెక్కించాలని నిర్మాత అశ్విని దత్ అల్లుడు నాగ అశ్విన్ ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే సావిత్రి జీవిత కథలో నటించే హీరోయిన్ కోసం చాలామందినే అనుకున్నారు. ముందుగా ఆ పాత్రకి బాలీవుడ్ నటి విద్యాబాలన్ అని తర్వాత నిత్యా మీనన్ అయితే బావుంటుందని అనుకున్నారు. దాదాపుగా నిత్యా మీనన్ అయితే సెలెక్ట్ అయినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక మొన్నటికి మొన్న సమంత కూడా మహానటిలో నటిస్తుందని ప్రచారం జరిగింది. మరి అసలు మహానటి సావిత్రి పాత్రకి ఎవరైతే బావుంటుందో అని నాగ్ అశ్విన్ తీవ్ర ఆలోచనలో వున్నాడు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ పేరు మహానటి పాత్రకి వినబడుతుంది.

'నేను శైలజ' తో తెలుగులో పరిచయమై అటు తమిళంలో ఇటు తెలుగులో హీరోయిన్ గా మంచి మంచి ఛాన్స్ లు కొట్టేస్తూ దూసుకుపోతున్న కీర్తి సురేష్ 'మహానటి సావిత్రి' పాత్రకి ఎంపికైనట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే కీర్తి టాలీవుడ్ టాప్ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల పక్కన హీరోయిన్ గా ఎంపికై ఒక్కసారే టాప్ పొజిషన్ లోకి వచ్చేసింది. ఇక ఇప్పుడు సావిత్రి బయోపిక్ లో కూడా సావిత్రి పాత్రకి ఎంపికైతే ఇక కీర్తి సురేష్ పేరు ఎక్కడో మారుమోగిపోతుంది. అతి తక్కువ సమయంలోనే కీర్తి ఇలా బంపర్ ఆఫర్స్ ని చేజిక్కించుకుని లక్కీ హీరోయిన్ అయిపొయింది. ఇక తెలుగులో నాని తో కలిసి నటించిన 'నేను లోకల్' సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. అయితే కీర్తి సురేష్ మహానటిలో ఎంపికైన విషయం అధికారికం గా ప్రకటించవలసి వుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ