తనదైన శైలిలో ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం వర్మకు అలవాటే. కాగా ఆయనకు మెగాఫ్యామిలీతో ఎందుకు చెడిందో గానీ ఈమద్య వారిని తన వెటకారపు ట్వీట్లతో ఇబ్బందులు పెడుతున్నాడు. ఇటీవలే పవన్ నటిస్తున్న 'కాటమరాయుడు' పోస్టర్ గురించి ట్వీట్ చేసిన వర్మ, తాజాగా చిరు 'ఖైదీ నెంబర్150'లోని తాజా పోస్టర్ విడుదలైన సందర్భంగా వాటిని షేర్ చేస్తూ,చాలా వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. ఈ ఫోజు కోసం మేడం టుసాడ్స్ మ్యూజియం వారు తమ దగ్గరున్న సగం విగ్రహాలను అవతల పారేస్తారన్నాడు. మెగాస్టార్‌ని ఈ ఫోజులో కూర్చొబెట్టిన డిజైనర్, దర్శకుడి పాదాలు తాకాలనుందన్నాడు. స్వామిరక్తి, స్వయం ప్రేమకు దీనిని పరాకాష్టగా పేర్కొన్నాడు. జర్మనీ తత్వవేత్త హెగ్‌ల్ ఉంటే మెగాస్టార్‌ను ముద్దాడే వారని, ఈ పోస్టర్ డిజైనర్‌తో పాటు, మెగాస్టార్‌ని ఈ ఫోజులో కూర్చోవడానికి ఒప్పించిన ఇతరుల ఫోన్ నెంబర్లు, చిరునామాలు తనకి కావాలని వర్మ అడగడం వెటకారానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. మరి మెగాఫ్యాన్స్ వర్మ వ్యాఖ్యలపై ఎలా ఎదురుదాడికి దిగి, తమ ప్రతిస్పందనను తెలియజేస్తారో వేచిచూడాల్సివుంది.