Advertisementt

కంగనా రౌనత్‌ నుండి మరో షాకింగ్ న్యూస్..!

Wed 04th Jan 2017 11:29 AM
kangana ranaut,bollywood heroine,blue film,gang star  కంగనా రౌనత్‌ నుండి మరో షాకింగ్ న్యూస్..!
కంగనా రౌనత్‌ నుండి మరో షాకింగ్ న్యూస్..!
Advertisement
Ads by CJ

పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సన్నిలియోన్‌ వంటి వారు బాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్నారు. కాగా అద్భుతమైన టాలెంట్‌ ఉన్న హీరోయిన్‌గా, జాతీయ అవార్డును కూడా గెలుచుకున్న 'క్వీన్‌' కంగనా రౌనత్‌ మాత్రం తన కెరీర్‌ మొదట్లో ఇలాంటి పెద్ద గండం నుండి గట్టెక్కానని చెప్పుకొచ్చింది. 2006లో ఆమె 'గ్యాంగ్‌స్టర్‌' చిత్రం ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ దానికి ముందే ఆమెకు ఎలాంటి అవకాశాలు రాక నిరుత్సాహంలో ఉన్న సమయంలో ఓ చెత్త చిత్రంలో చాన్స్‌ వచ్చిందట. ఏ చిత్రమైనా ఫర్వాలేదు.. చేయాలి అనే పరిస్థితుల్లో ఆమె ఉండటంతో ఆ చిత్రానికి ఓకే చెప్పింది. కాగా ఈ చిత్రం కాస్టూమ్స్‌ రోబ్‌ నాకిచ్చారు. అందులో అసలు దుస్తులే లేవు. డైరెక్టర్‌ని అడిగితే నగ్నంగా నటించే సీన్‌ ఉందని చెప్పాడు. దాంతో నాకు అది నీలిచిత్రమేమో అనే అనుమానం వచ్చింది. ఇంతలోనే నాకు 'గ్యాంగ్‌స్టర్‌' చిత్రంలో అవకాశం రావడంతో అందులో నటించి మంచి పేరు తెచ్చుకున్నాను. అదే సమయంలో 'గ్యాంగ్‌స్టర్‌' చిత్రం అవకాశం నాకు రాకపోయి ఉంటే నీలిచిత్రం వంటి సినిమాలో నటించేదానిని. ఆ తర్వాత ఆ సినిమా చేయనని చెప్పడంతో నిర్మాత ఆగ్రహించి, ఎన్నో విధాలుగా నన్ను ఇబ్బందుల పాలు చేశాడు. దాంతో నాకు భారీ నష్టమే జరిగింది. అదే నేను ఆ చిత్రంలో నటించి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదా? అని అప్పుడప్పుడు అనుమానం వస్తుంటుంది. మొత్తానికి ఆ గండం నుంచి నేను బయటపడ్డాను.. అని చెప్పుకొచ్చింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ