Advertisementt

ఆ హీరో వ్యాఖ్యలపై సెటైర్లు..!

Thu 05th Jan 2017 01:51 PM
bollywood hero,coffee with karan,shahid kapoor,wife of meera rajputh,three quations,priyanka chopra  ఆ హీరో వ్యాఖ్యలపై సెటైర్లు..!
ఆ హీరో వ్యాఖ్యలపై సెటైర్లు..!
Advertisement
Ads by CJ

తాజాగా 'కాఫీ విత్‌ కరణ్‌' ప్రోగ్రాంకు బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌తో పాటు ఆయన భార్య మీరారాజ్‌పుత్‌ హాజరయ్యారు. కరణ్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఈ జంట చాలా బోల్డ్‌గా సమాధానాలు చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్‌లను మూడు ప్రశ్నలు అడుగుతారు. మీకు చంపే అవకాశం వస్తే ఎవరిని చంపుతారు? మీకు పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎవరిని చేసుకుంటారు? మీకు ఎఫైర్‌కు అవకాశం వస్తే ఎవరిని ఎంచుకుంటారు? అనే మూడు ప్రశ్నలుంటాయన్న సంగతి తెలిసిందే. దీనికి షాహిద్‌కపూర్‌ సమాధానం ఇస్తూ, తనకు చంపే అవకాశం వస్తే ప్రియాంకా చోప్రాను చంపుతానని, పెళ్లి చేసుకునే అవకాశం వస్తే సోనాక్షిసిన్హాను చేసుకుంటానని, ఎఫైర్‌ అవకాశం వస్తే తాజా బాలీవుడ్‌ సంచలనం, సెక్సీ బ్యూటీ అలియాభట్‌ను ఎంచుకుంటానని షాహిద్‌ సమాధానం చెప్పాడు. కాగా గతంలో షాహిద్‌ ప్రియాంకా చోప్రాతో కలసి నటించాలని ప్రయత్నించినప్పటికీ ఆమె ఉన్న బిజీలో ఆ చిత్రానికి నో చెప్పింది. దాంతో తనతో నటించలేదనే కోపంతోనే ఆయన ప్రియాంకా చోప్రాను చంపుతానని సమాధానమిచ్చాడని కొందరు వెటకారపు సెటైర్లు వేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ