Advertisementt

అసలు విషయం బయటకు వచ్చింది..!

Thu 05th Jan 2017 07:51 PM
director maaruthi,bus stop movie,bhale bhale magadioye movie,producer maaruthi,sharwanand,mahanubhavudu movie  అసలు విషయం బయటకు వచ్చింది..!
అసలు విషయం బయటకు వచ్చింది..!
Advertisement
Ads by CJ

ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ సాధించిన నేటితరం దర్శకుల్లో మారుతి కూడా ఒకడు. కాగా ఈయన తీసిన 'ఈ రోజుల్లో' చిత్రం మెదట విడుదలైంది. ఈ చిత్రం తర్వాత ఆయన తీసిన 'బస్టాప్‌' వచ్చింది. ఈ విషయాలను మారుతినే స్వయంగా మీడియాకు తెలుపుతూ, ముందుగా 'బస్టాప్‌' చిత్రం ప్రారంభించాం. కానీ కొంత భాగం షూటింగ్‌ తర్వాత డబ్బుల్లేక ఆ చిత్రాన్ని ఆపేశాం. ఆ తర్వాత వర్మ గారి ఇన్‌స్పిరేషన్‌తో 5డి కెమెరాతో 'ఈ రోజుల్లో' చిత్రం తీశాను. ఈ చిత్రానికి కూడా నా డగ్గర డబ్బు లేకపోవడంతో నా స్నేహితుని వద్ద 15లక్షలు అప్పు చేసి సినిమాను పూర్తి చేశాం. ఈ చిత్రం సెన్సార్‌ విషయంలోనే గాక, టెక్నికల్‌గా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒకానొక సమయంలో ఏడ్చేశాను. ఈ చిత్రం విడుదలై మంచి హిట్టు అయింది. ఆ చిత్రానికి వచ్చిన లాభాలతో 'బస్టాప్‌'ను పూర్తి చేశాను. ఈ రెండు చిత్రాలు విడుదలకు ముందు వీటి ద్వారా బూతు ముద్ర పడుతుందని, అడల్ట్‌ కంటెంట్‌ ఉన్న సినిమాలు కావడంతో నాపై చెడ్డ ముద్ర, విమర్శలు వస్తాయని ముందుగానే ఊహించాను, అనుకున్నట్లే బూతు ముద్రతో పాటు విమర్శలు, వాటితో పాటు డబ్బులు కూడా బాగా వచ్చాయి అని తెలిపాడు. 

కాగా 'ప్రేమ కథా చిత్రమ్‌' సినిమాను తానే దర్శకత్వం చేశానని ఆ మధ్య ఆయన ఓఇంటర్వ్యూలో చెప్పాడు. సినిమా సక్సెస్‌ అయితే తనదంటాడని, ఫ్లాప్‌ అయితే ఇతరులపై తోస్తాడనే చెడ్డపేరు ఆయనకు వచ్చింది. దీని గురించి మాట్లాడుతూ, ఈ చిత్రానికి నేనే ప్రతిషాట్‌కు దర్శకత్వం వహించి, తెరకెక్కించాను. కానీ ఈ సినిమా హర్రర్‌ మూవీ కావడంతో ఆడుతుందో లేదో అన్న భయంతో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రభాకర్‌రెడ్డి పేరు వేశాను. ఈ చిత్రానికి ప్రతిపైసా ఖర్చుపెట్టిన నిర్మాతను కూడా నేనే అని ఆయన మరోసారి ప్రకటించాడు. మొత్తానికి ఈ మారుతి 'భలే భలే మగాడివోయ్‌'తో మంచి పేరు తెచ్చుకుని పెద్ద హిట్‌ ఇచ్చిన్పటికీ తర్వాత వెంకీ, నయనతార వంటి స్టార్‌హీరో, హీరోయిన్లు ఇచ్చిన పెద్ద అవకాశాన్ని మాత్రం వృదా చేశాడనే చెప్పాలి. త్వరలో ఆయన శర్వానంద్‌ హీరోగా యువి క్రియేషన్స్‌ బేనర్‌లోనే 'మహానుభాహుడు' చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. మరి ఈ చిత్రమైనా ఆయనకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందో లేదో చూడాల్సివుంది. అదే 'బాబు బంగారం'చిత్రం హిట్టయి ఉంటే ఇప్పటికే పలువురు స్టార్స్‌ చిత్రాలలో అవకాశం దక్కించుకునే వాడని విశ్లేషకులు అంటున్నారు. ఇది.. నిజం కూడా...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ