నాగ చైతన్య - సమంతల ప్రేమ, పెళ్లి గురించిన వార్తలు మీడియాకి బాగా అలవాటైపోయాయి. వీరిద్దరూ తొందరలోనే పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ జంట క్రిష్ట్మస్ పండుగతోపాటే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని కూడా కలిసే జరుపుకున్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని అయితే గోవాలో టాలీవుడ్ స్టార్స్ రకుల్ ప్రీత్ సింగ్, రానా, శ్రీయ, రెజినా, శ్రీయ రెడ్డి,అఖిల్, సాయి ధరమ్ తేజలతో కలిసి అదిరిపోయే లెవల్లో జరుపుకున్న ఈ జంట ఈ నెల 29న నిశ్చితార్ధం చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
మరీ ఆ డేట్ లో నిశ్చితార్ధం జరుగుతుందో లేదో? తెలియదుగాని... నాగ చైతన్య కొత్త చిత్రమొకటి పూజా కార్యక్రమాలు జరుపుకునే అవకాశం మాత్రం ఉందంటున్నారు. నాగ చైతన్య మేనమామ సురేష్ బాబు, నాగ చైతన్య హీరోగా ఎప్పటినుండో ఒక సినిమా ని నిర్మించాలని ఆశపడుతున్నాడు. కృష్ణ అనే కొత్త దర్శకుడితో నాగ చైతన్య హీరోగా రానా దగ్గుబాటి నిర్మాణంలో ఒక చిత్రం సెట్స్ మీదకెళ్లబోతుందని సమాచారం. అయితే ఆ సినిమా పూజా, చైతూ నిశ్చితార్ధం జనవరి 29 న ఒకే రోజు అన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే నాగ చైతన్య ఎంగేజ్మెంట్ డేట్, మేనమామ నిర్మాణంలో తెరకెక్కబోయే చిత్ర పూజ రెండూ ఒకే రోజు రావడంతో సంతోషం పట్టలేకపోతున్నాడని అంటున్నారు. అయితే ఎంగేజ్మెంట్ డేట్ గురించి, కొత్త చిత్ర పూజా కార్యక్రమాల గురించి అటు అక్కినేని ఫ్యామిలీ ఇటు దగ్గుబాటి ఫ్యామిలీనుండి అధికారిక ప్రకటన రావాల్సి వుంది.