Advertisementt

మరోసారి డర్టీ డర్టీ గా.....!

Fri 06th Jan 2017 04:32 PM
begam jaan,vidya balan,dirty picture  మరోసారి డర్టీ డర్టీ గా.....!
మరోసారి డర్టీ డర్టీ గా.....!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ సంచలన నటి విద్యాబాలన్‌ నటించిన 'డర్టీ పిక్చర్‌' ఎంత పెద్దహిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. కాగా పెద్ద హిట్‌ అయినప్పటికీ ఈ చిత్రం డర్టీగా ఉందనే విమర్శలు వచ్చాయి. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం మరింత డర్టీగా ఉండనుందని అంటున్నారు. ప్రస్తుతం నేషనల్‌ అవార్డు విన్నర్‌ అయిన ప్రముఖ బెంగాలీ దర్శకుడు శ్రీజిత్‌ ముఖర్జీ బెంగాళీలో తీసిన 'రాజ్‌కహాని' కి రీమేక్‌గా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా శ్రీజిత్‌ ముఖర్జీ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం. కాగా ఈ చిత్రం బాలీవుడ్‌లో 'బేగమ్‌జాన్‌' అనే పేరుతో రూపొందుతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో విద్యా హుక్కా తాగుతున్న ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 1947 ప్రాంతంలో అంటే దేశవిభజన జరిగే సమయంలో పంజాబ్‌లో వేశ్యగృహాన్ని నడిపే బేగమ్‌జాన్‌గా విద్యా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయనున్నారు. మరి ఈ చిత్రంతో విద్యా మరోసారి హాట్‌టాపిక్‌గా మారనుందని బాలీవుడ్‌ విశ్లేషకులు బల్ల గుద్ది చెబుతున్నారు. కొంతకాలంగా హిట్‌లేని విద్యాబాలన్‌కు ఈ చిత్రం మునుపటి వైభవం తెస్తుందని ఆమె అభిమానులు సంతోషపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ