దాదాపు మూడున్నరేళ్లు ఇతర సినిమాలు ఒప్పుకోకుండా 'బాహుబలి' కోసం త్యాగం చేసిన ప్రభాస్ కి ఎట్టకేలకు 'బాహుబలి' నుండి విముక్తి లభించింది. విముక్తి అంటే ప్రభాసేదో 'బాహుబలి'లో ఇరుక్కుపోయి తన టైమ్ వెస్ట్ చేసుకున్నాడని కాదు..... ఇన్ని రోజులనుండి ఒక్క 'బాహుబలి'కే టైమ్ వెచ్చించి ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అవడం తో కాస్త ఫ్రీ అయ్యి వేరే సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడన్న మాట. 'బాహుబలి పార్ట్ 1 , బాహుబలి 2 ' లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డైరెక్టర్ రాజమౌళి, హీరో ప్రభాస్, రానా, అనుష్క వీళ్ళేమిటి మొత్తం చిత్ర బృందం ఇందులో వుంది.
ఇక భారతదేశంలో 'బాహుబలి' ఒక సంచలనం. ఇక ఈ సంచలనంలో భాగం అయిన ప్రభాస్ ఇప్పటివరకు వేరే సినిమాలో నటించకుండా కేవలం బాహుబలి మొదటి, రెండు పార్ధులకే టైమ్ వెచ్చించాడు. ఇందులో భాగమవడం తన అదృష్టంగా భావిస్తానని చెపుతున్నాడు ప్రభాస్. బాహుబలి 1 ని 2015 లో విడుదల చేసి బాహుబలి 2 కోసం గత కొద్ది నెలలుగా షూటింగ్ చేస్తున్న ప్రభాస్ కు సంబందించిన సన్నివేశాలు ఈ రోజు(శుక్రవారం) ఉదయంతో ముగిసినట్టు..... ఇక 'బాహుబలి' ప్రభాస్ పార్ట్ షూటింగ్ ముగిసినట్టు రాజమౌళి ట్వీట్ చేసాడు. ఇక 'బాహుబలి' కోసం మూడున్నరేళ్లు కష్టపడిన ప్రభాస్ కి 'థాంక్యూ డార్లింగ్' అంటూ కృతఙ్ఞతలు తెలిపాడు.
మరి 'బాహుబలి' నుండి బయటికి వచ్చిన ప్రభాస్ ఇక ఇతర సినిమాల కోసం సమయం వెచ్చించనున్నాడు. ఇప్పటికే సుజిత్ తో సినిమా కమిట్ అయిన ప్రభాస్ ఆ సినిమా కోసం ప్రిపేర్ అవుతాడని చెబుతున్నారు. ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' ఏప్రిల్ నెలాఖరులో విడుదల కానుంది.