Advertisementt

మహేష్ భయపడినట్లున్నాడు..!

Sat 07th Jan 2017 04:38 PM
mahesh babu,prabhas,baahubali2 movie,director murugaadas,director raja mouli  మహేష్ భయపడినట్లున్నాడు..!
మహేష్ భయపడినట్లున్నాడు..!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ - తమిళ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషలో రూపొందుతున్న భారీ ప్రతిష్ట్మాక చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతానికి హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే అహ్మదాబాద్, ముంబైలో జరుపుకునే షూటింగ్ తో మొత్తం ఈ చిత్ర చిత్రీకరణ పూర్తికానుందని సమాచారం. ఇక ఇప్పటివరకు టైటిల్ రివీల్ చెయ్యని ఈ చిత్రం ఏప్రిల్ 28  న విడుదల చేస్తామని రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఏప్రిల్ నుండి జూన్ కి పోస్ట్ ఫోన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. కారణం ఏప్రిల్ 28న రాజమౌళి ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి పార్ట్ 2' రిలీజవుతుండడం. అందుకే తమ సినిమాని జూన్ 23న రంజాన్ కానుకగా విడుదల డేట్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇంతకుముందు 'శ్రీమంతుడు' రిలీజ్ అప్పుడు కూడా 'బాహబలి 1' రిలీజ్ డేట్ క్లాష్ అవడంతో అప్పుడు ఇరువురు నిర్మాతలు చర్చలు జరిపి విడుడల తేదీలు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా 'బాహుబలి', మహేష్ చిత్రం రిలీజ్ డేట్స్ క్లాష్ అవడంతో మహేష్ కొంచెం తగ్గి తన సినిమాని జూన్ కి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తునట్లు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా మొదటిసారి రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఇక టైటిల్ గా 'సంభవామి' అని అనుకుంటునప్పటికీ ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ