Advertisementt

రెండు రోజుల పాటు సందడే.. సందడి..!

Sun 08th Jan 2017 02:33 PM
young tiger ntr,akkineni nagarjuna,om namo venkatesaya movie,audio launch on january 8th 2017,manchu vishnu,hansika  రెండు రోజుల పాటు సందడే.. సందడి..!
రెండు రోజుల పాటు సందడే.. సందడి..!
Advertisement
Ads by CJ

రేపు అంటే 8వ తేదీ ఆదివారం సాయంత్రం కింగ్‌ నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి' వంటి భక్తిరస చిత్రాల తర్వాత చేస్తున్న మరో సంచలన చిత్రం 'ఓం నమోవేంకటేశాయ' చిత్రం ఆడియో వేడుకను హైదరాబాద్‌లో హైటెక్స్‌లో ఫ్యాన్స్‌ సమక్షంలో పలువురు ప్రముఖుల మధ్య గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి మైమరపించే, పులకరింపజేసే ఆల్బమ్‌ను ఇచ్చారని, సంగీత ప్రియులు, ముఖ్యంగా భక్తిరస సంగీతాన్ని, మెలీడీని ఇష్టపడే వారు కలకాలం దాచుకునేలా ఇది ఉండనుంది సమాచారం. ఇక ఈ నెల 9వ తేదీన అంటే సోమవారం సాయంత్రం మంచు విష్ణు, హన్సిక్‌ జంటగా 'గీతాంజలి' ఫేమ్‌ రాజ్‌కిరణ్‌ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'లక్కునోడు' ఆడియో వేడుక హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెక్షన్‌ సెంటర్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. మోహన్‌బాబు తనకున్న పరిచయాలతో పలువురు ప్రముఖులను ఈ వేడుకకు రప్పించనున్నాడు. ఈ చిత్రానికి అచ్చు-ప్రవీణ్‌ లక్కరాజులు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్‌లోని మూడు పేరున్న ఫ్యామిలీలైన మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీల హీరోల వేడుకలు వరుస తేదీలలో గ్రాండ్‌గా జరుపుకోనుండటంతో ఈ మూడు ఫ్యామిలీల అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ