టాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రం తర్వాత రుద్రమదేవి ప్రజల్లో కాస్త క్రేజీని సంపాదించినా.. ఆ తర్వాత అంతటి క్రేజ్ ను సృష్టిస్తున్న చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'. ఇది తెలుగుకు సంబంధించిన ఓ చక్రవర్తి కథ కావడంతో ఇంతటి పేరు వస్తుందనే చెప్పాలి. అందులోనూ బాలకృష్ణ నూరవ చిత్రం అయ్యేసరికి ఆ క్రేజ్ మరింత ద్విగినీకృతం అయ్యిందనే చెప్పవచ్చు. 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రానికి సంబంధించిన యుద్ధాలుగానీ, అందులో విజువల్ ఎఫెక్ట్స్ గానీ అద్భుతరీతిలో ఉంటాయని తెలియడంతో చిత్రసీమ అంతా ఈ చిత్రంపైనే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రానికి ఆది నుండీ కాస్తో కూస్తో తనకు తోచినంత సపోర్టు చేస్తున్నాడు రాజమౌళి. టీజర్ నుండి మొదలు పెట్టి అన్నింటిపైనా ఆ చిత్రంపై తన అభిప్రాయాన్ని ప్రకటించాడు రాజమౌళి. అదేవిధంగా టీజర్ ను, ట్రైలర్ ను చూసి దర్శకుడు క్రిష్‌ని అభినందించాడు రాజమౌళి. అంతేకాకుండా విజువల్ ఎఫెక్ట్స్ పై ఎలా శ్రద్ధ పెట్టాలన్న విషయంపై కూడా కొన్ని జాగ్రత్తలు సూచించాడు రాజమౌళి.
కాగా తాజాగా బాహుబలికి పనిచేస్తున్న వీఎఫ్ఎక్స్ బృందం శాతకర్ణికీ కూడా పని చేసిందని సమాచారం అందుతుంది. అందుకోసమనో మరి మరే కారణమో తెలియదు గానీ, క్రిష్ కృతజ్ఞతా పూర్వకంగా రాజమౌళి అండ్ వారి బృందానికి 'గౌతమిపుత్ర శాతకర్ణి' స్పెషల్ షో ప్రదర్శించాలని క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే రాజమౌళి నచ్చిన... తను చూడాలనుకున్న చిత్రాన్ని సినిమా విడుదలైన రోజున కుటుంబ సభ్యులతో కలిసి చూడటం ఇష్టం. బాగా నచ్చితే వెంటనే ఆ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా స్పందిస్తాడు. కాగా ధియేటర్ లో చూడటం ఇష్టంగా భావించిన రాజమౌళికి...... క్రిష్ ప్రత్యేకంగా షో వేస్తానని చెప్పినా ధియేటర్ లోనే చూస్తానని వెల్లడించినట్లు తెలుస్తుంది. అయితే మొత్తానికి 12వ తేదీనాడు గౌతమి పుత్ర శాతకర్ణి ఫస్ట్ డే, ఫస్ట్ షో రాజమౌళి చూస్తాడన్న మాట. అయితే సినిమా చూశాక రాజమౌళి ఎలాంటి అభిప్రాయాన్ని ప్రకటిస్తాడో వేచి చూడాలి.