Advertisementt

చిరూని చూసి బాలయ్య కూడా...!

Mon 09th Jan 2017 08:45 PM
balakrishna,gautamiputra satakarni movie,chiranjeevi,khaidi no 150 movie  చిరూని చూసి బాలయ్య కూడా...!
చిరూని చూసి బాలయ్య కూడా...!
Advertisement
Ads by CJ

'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం సంక్రాంతి రేసులో వుంది. ఇక ఆడియో లాంచ్ మొదలుకుని థియేట్రికల్ ట్రయిలర్ అంటూ పబ్లిసిటీ  కార్యక్రమాల్లో ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఫాన్స్ మీట్ అంటూ... ఒకసారి, పతాకావిష్కరణ అంటూ మరోసారి నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తో హంగామా చేస్తున్నాడు. నందమూరి ఫ్యాన్స్ తో గడుపుతూ శాతకర్ణి ని ఎలా పబ్లిసిటీ చెయ్యాలో అలా పబ్లిసిటీ చేస్తున్నాడు బాలకృష్ణ. ఇప్పటికే 'ఖైదీ నెంబర్ 150' చిత్రం కూడా పబ్లిసిటీ కార్యక్రమాల్లో తలమునకలై ఉండగా ఖైదీ.... చిత్ర నిర్మాత కూడా గౌతమి.... పబ్లిసిటీ కి ఏమాత్రం తీసిపోకుండా ఖైదీ..... ని ప్రమోట్ చేస్తున్నాడు.

ఇక ఖైదీ.... చిత్ర థియేట్రికల్ ట్రైలర్ లో చిరంజీవి 'పొగరు నా వంట్లో  ఉంటుంది.... హీరోయిజం నా ఇంట్లో ఉంటుందని' డైలాగ్స్ డెలివరి లో కేక పుట్టించేసాడు. మరి చిరంజీవి అలా తన పొగరు చూపిస్తూ డైలాగ్ చెప్పడం చూసి ఏమో బాలకృష్ణ కూడా నిన్న జరిగిన గౌతమీపుత్ర.... పతాకావిష్కరణ కార్యక్రమం లో రెచ్చిపోయి డైలాగ్స్ చెప్పేసాడు. 'ఇక్కడ మా ఇంట్లో గదికి గోడలుంటాయి. గొడవలుంటాయి. ఇది మా ఇల్లంటూ కొట్టుకుంటా.కానీ మధ్యలో ఇంకొకడు వచ్చి ఇది మా ఇల్లంటే ఎగరేసి నరుకుతా.. సరిహద్దుల్లో స్మశానం నిర్మిస్తాం.. మీ మొండేలను మా జెండాలా ఎగరేస్తాం' అని బాలయ్య ఆవేశంగా డైలాగ్స్ చెప్పి కేక పుట్టించాడు.

మరి నువ్వా నేనా అని బరిలోకి దిగుతున్న 'ఖైదీ నెంబర్ 150 , గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలకు ప్రేక్షకులు ఏ విధమైన తీర్పునిస్తారో మరో రెండు మూడు రోజులల్లో తేలిపోతుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ