Advertisementt

ఈ నటి పాస్ పోర్ట్ పై రాజకీయ ప్రయోగాలు..!

Tue 10th Jan 2017 02:23 PM
kushboo,pass port,politics,kollywood actress kushboo  ఈ నటి పాస్ పోర్ట్ పై రాజకీయ ప్రయోగాలు..!
ఈ నటి పాస్ పోర్ట్ పై రాజకీయ ప్రయోగాలు..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్రనటిగా ఒకప్పుడు దున్నేసిన నటీమణి ఖుష్బు. అయితే ఈ మధ్య  అమ్మడు రాజకీయాలని తమిళనాట హడావుడి చేసి విపక్షంలో సభ్యరాలిగా వ్యవహరిస్తుంది. అలాంటి నటికి తాజాగా ఓ వింత అనుభవం ఎదురైంది. ఖుష్బు పాస్ పోర్ట్ రెన్యువల్ కు అప్లై చేస్తే పాస్ పోర్ట్ అధికారులు ఆమె పాస్ పోర్ట్ కు అనుమతిని నిలిపివేశారు. కాగా చాలా కాలం నుండి ఖుష్బు సినిమాలకు దూరంగా ఉండి ఈ మధ్యనే పవన్ సినిమాలో అవకాశాన్ని దొరకబుచ్చుకుంది ఖుష్బు. 

అయితే ఖుష్బుకు పాస్ పోర్ట్ ను ఎందుకు నిరాకరించారంటే...ఎన్నికల ప్రచారంలో ఖుష్బుపై మూడు కేసులు నమోదు అయ్యాయని అందుకు పాస్ పోర్ట్ నిరాకరించినట్లు అధికారులు చెప్తున్నారు. కానీ ఖుష్బు మాత్రం తనపై నమోదైన కేసులపై గతంలోనే హైకోర్టు స్టే ఇచ్చిందనీ, అయినాగానీ పాస్ పోర్ట్ అధికారులు తమ పాస్ పోర్ట్ విషయంలో నిర్లక్ష్యం చేయడం హాస్యాస్పదంగా ఉందని వెల్లడించింది. ఇంకా ఆమె మాట్లాడుతూ తాను పాస్ పోర్ట్ రెన్యువల్ కోసం అప్లై చేయలేదని, తన ప్రయాణాల కారణంగా పాస్ పోర్ట్ బుక్ నిండిపోవడంతో మరో కొత్త బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పింది. మరో బుక్ కోసమే తాను అప్లికేషన్ పెట్టుకున్నానని అంతే గానీ, రెన్యువల్ ఏమాత్రం కాదని, తనకు 2022 వరకూ పాస్ పోర్ట్ అనుమతి ఉందని ఖుష్బు తెలిపింది. కాగా కేవలం రాజకీయ దురుద్దేశంతోనే పాస్ పోర్ట్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆమె వివరించింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ